Premantene Chitram
-
సమాజంలో ఎలా జీవించాలో చెప్పాం
‘‘తల్లిదండ్రులకు తెలియకుండా డేటింగ్లు చేయడం, కెమెరాలకు, సెల్ఫోన్లకు బలైపోవడం నేటి యువతకు పరిపాటైపోయింది. దే శంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనలు ఈ సినిమా కళ్లకు కడుతుంది. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా సమాజంలో ఎలా జీవించాలో ఈ సినిమా ద్వారా చెప్పాం. యువతకు కనువిప్పులాంటిదీ సినిమా’’ అన్నారు దర్శకుడు వి.ఆర్. దొరైరాజు. మానస్, ఆరుషి జంటగా గంగవరపు శ్రీనివాసులునాయుడు, జీవీ నరసయ్య, కృత్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటేనే చిత్రం’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని దొరైరాజు ఆనందం వ్యక్తం చేస్తూ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘ఈ సినిమా విజయం నాకు రెండు అవకాశాలు తెచ్చిపెట్టింది. ఓ ప్రముఖ హీరోతో ఓ సినిమా చేయబోతున్నాను. గురుపాటి సురేష్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. అలాగే పంపిణీదారుడు నందా నిర్మాతగా ఓ చిత్రం ఉంటుంది. ఇందులో ఇద్దరు యువ హీరోలు నటిస్తారు. వినోదం, సందేశం కలగలిసిన కథాంశాలతో ఈ చిత్రాలు చేయబోతున్నాను’’ అని తెలిపారు. -
వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమంటేనే చిత్రం
మానస్, ఆరుషి జంటగా గునపాటి సురేష్‌రెడ్డి సమర్పణలో గంగవరపు శ్రీనివాసులునాయుడు, జీవీ నరసయ్య, కృత్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటేనే చిత్రం’. వి.ఆర్. దొరైరాజు దర్శకుడు. ఈ చిత్రం పాటలను ఆదివారం పాత్రికేయులకు ప్రదర్శించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘దేశంలోని కొన్ని పట్టణాల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశాం. ప్రేమ, వినోదం, సందేహం సమాహారంతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. నవంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత శ్రీనివాసులు నాయుడు చెప్పారు. పాటలు విజయం సాధించినట్లుగానే సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నరసయ్య తెలిపారు. మంచి పాత్ర చేశానని ఆరుషి చెప్పారు. ఈ చిత్రంలో దర్శకుడు మంచి పాత్ర ఇచ్చారని, మంచి సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు మిగులుతుందని మానస్ అన్నారు.