గుర్రం ఎగరబోతోంది... | 'Emo Gurram Egaravachu' movie releasing on Jan24th | Sakshi
Sakshi News home page

గుర్రం ఎగరబోతోంది...

Published Mon, Jan 6 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

గుర్రం ఎగరబోతోంది...

గుర్రం ఎగరబోతోంది...

 ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’... ఈ టైటిల్‌లో ఎంత కొత్తదనం ఉందో... అంత వేదాంతం కూడా ఉంది. దర్శకుడు చంద్రసిద్దార్థ్ ఆలోచనాధోరణి ఎంత భిన్నంగా ఉంటుందో చెప్పడానికి ఈ టైటిల్ ఓ తార్కాణం. పెళ్లి విషయంలో నేటి యువతరం ఆలోచనాధోరణి ఎలా ఉంటుంది? అనే అంశం చుట్టూ తిరిగే కథ ఇదని తెలుస్తోంది. మరి దీనికి ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’.. అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే... ఈ నెల 24 దాకా ఆగాల్సిందే. 
 
 ఎందుకంటే, నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. సుమంత్, పింకీ సావిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని పూదోట సుధీర్‌కుమార్ నిర్మించారు. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఇటీవలే విభిన్నంగా బ్యాంకాక్‌లో విడుదల చేశారు. ఆద్యంతం సరదాగా సాగిపోయే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చితీరుతుందని చంద్రసిద్దార్థ్ చెబుతున్నారు. ‘మధుమాసం’ తర్వాత సుమంత్, చంద్రసిద్దార్థ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదని, సుమంత్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: కాంచి,  కెమెరా: చంద్రమౌళి, రాజేంద్ర, కూర్పు: జీవీ చంద్రశేఖర్,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement