Emo Gurram Egaravachu
-
తాతయ్య ఫొటో చూడగానే ఓకే చెప్పేశాను - సుమంత్
‘‘ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’లో తొలిసారి కామెడీ పాత్ర చేశాను. సుమంత్ కామెడీ కూడా బాగా చేయగలడు అని ఈ చిత్రం నిరూపించింది. నటునిగా నాకెంతో సంతృప్తి కలిగిస్తున్న విషయం ఇది’’ అని సుమంత్ అన్నారు. ఆయన కథానాయకునిగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో పూదోట సుధీర్‌కుమార్ నిర్మించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో సుమంత్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో ఆడవేషం వేయాలని చంద్రసిద్దార్థ్ చెప్పినప్పుడు కొంచెం ఆలోచించాను. ఇంటికెళ్లగానే... తొలినాళ్లలో తాతయ్య ఆడవేషం వేసిన నిలువెత్తు ఫొటో కనిపించింది. ఆ ఫొటో చూడగానే... ఇక ఆలోచించకుండా చంద్రసిద్దార్థ్కి ‘ఓకే’ చెప్పేశాను. రియల్ లైఫ్‌లో నా కేరక్టర్‌కి పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఇందులో నేను చేశాను. నిజంగా ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన పాత్ర ఇది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రేమకథ ఇదని, నేటి యువతరం మనోభావాలను ఇందులో చూపించామని చంద్రసిద్దార్థ్ అన్నారు. ‘‘వ్యాపారవేత్తగా ఇక్కడ కొన్ని రోజులు, విదేశాల్లో కొన్ని రోజులు ఉండే నా జీవితానికి ఈ కథ చాలా దగ్గర. నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఇది’’ అని నిర్మాత అన్నారు. కథానాయిక పింకీ సావిక, కథారచయిత ఎస్.ఎస్.కాంచి, గేయరచయిత చైతన్యప్రసాద్ తదితరులు కూడా మాట్లాడారు. -
గుర్రం ఎగిరిందా!
-
‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా వాల్ పోస్టర్స్
-
గుర్రం ఎగరబోతోంది...
‘ఏమో గుర్రం ఎగరావచ్చు’... ఈ టైటిల్లో ఎంత కొత్తదనం ఉందో... అంత వేదాంతం కూడా ఉంది. దర్శకుడు చంద్రసిద్దార్థ్ ఆలోచనాధోరణి ఎంత భిన్నంగా ఉంటుందో చెప్పడానికి ఈ టైటిల్ ఓ తార్కాణం. పెళ్లి విషయంలో నేటి యువతరం ఆలోచనాధోరణి ఎలా ఉంటుంది? అనే అంశం చుట్టూ తిరిగే కథ ఇదని తెలుస్తోంది. మరి దీనికి ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’.. అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే... ఈ నెల 24 దాకా ఆగాల్సిందే. ఎందుకంటే, నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. సుమంత్, పింకీ సావిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని పూదోట సుధీర్‌కుమార్ నిర్మించారు. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఇటీవలే విభిన్నంగా బ్యాంకాక్‌లో విడుదల చేశారు. ఆద్యంతం సరదాగా సాగిపోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చితీరుతుందని చంద్రసిద్దార్థ్ చెబుతున్నారు. ‘మధుమాసం’ తర్వాత సుమంత్, చంద్రసిద్దార్థ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదని, సుమంత్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: కాంచి, కెమెరా: చంద్రమౌళి, రాజేంద్ర, కూర్పు: జీవీ చంద్రశేఖర్, -
బ్యాంకాక్‌లో పాటల గుర్రం ఎగిరింది!
‘‘ఇలా పాటల వేడుకను విభిన్నంగా బ్యాంకాక్‌లో నిర్వహించడం చాలా బావుంది. ఇలాంటి వేడుకలు సాంస్కృతిక సమ్మేళనానికి ఉపకరిస్తాయి. థాయ్ ప్రజలకు మన పాటలు నచ్చుతాయి. ఓ థాయ్ పాపులర్ సాంగ్‌ను, నా పాపులర్ సాంగ్‌ను కలిపి ఫ్యూజన్ సాంగ్లా విడుదల చేయాలని ఉంది’’ అని కీరవాణి చెప్పారు. ఆయన స్వరాలందించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ ఆడియో వేడుక ఇటీవల బ్యాంకాక్‌లో జరిగింది. సుమంత్, పింకీసావిక జంటగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో పూదోట సుధీర్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని ఆరు పాటల్ని, మూడు బిట్ సాంగ్స్‌ని బ్యాంకాక్‌లోని 9 విభిన్న ప్రదేశాల్లో విడుదల చేశారు. బ్యాంకాక్‌లో ఆడియో ఆవిష్కరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమా తమదే అయినందుకు చాలా ఆనందంగా ఉందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. కీరవాణిగారితో పనిచేయడం ఇదే తొలిసారి అని సుమంత్ చెప్పారు. వేల్ రికార్డ్స్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. ఈ వేడుకలో ఇంకా కథా రచయిత కాంచీ, గీత రచయిత చైతన్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'ఏమో గుర్రం ఎగరావచ్చు' ఆడియో
-
ఏమో గుర్రం ఎగరావచ్చు స్టిల్స్