రేసీగా... లవ్ రాజా | Express Raja release on 14th Jan | Sakshi
Sakshi News home page

రేసీగా... లవ్ రాజా

Published Tue, Dec 29 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

రేసీగా... లవ్ రాజా

రేసీగా... లవ్ రాజా

అతనొక జులాయి... ఆవారా... ఇడియట్.ఇలా ఎవరు పిలిచినా దాన్నొక బిరుదులా భావిస్తాడు కానీ, ‘ తిట్టు ’ అని మాత్రం అనుకోడు. అలాంటివాడు కాస్తా రాత్రికి రాత్రి మారిపోయాడు. ఓ కొత్త ప్రొఫెషన్‌లోకి ఎంటరై అక్కడ మెరుపులు మెరిపించాడు. ఈ అద్భుతం ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా ఆశ్చర్యం కలిగించిన ఆ అద్భుతం పేరు ‘ ప్రేమ’. ఓ అమ్మాయితో ప్రేమలో పడి గూడ్స్‌బండిలా ఉండేవాడు కాస్తా ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు తీయడం మొదలుపెట్టాడు.
 
 ఇలా రేసీ కాన్సెప్ట్‌తో ‘ఎక్స్‌ప్రెస్ రాజా ’ రూపొందింది. ‘ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ’ తర్వాత మేర్లపాక గాంధీ డెరైక్ట్ చేసిన సినిమా ఇది. ‘ రన్ రాజా రన్ ’, ‘ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ విజయాలతో ఊపు మీద ఉన్న శర్వానంద్ ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశారు. యూవీ క్రియే షన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement