ప్రభాస్ అన్న అభినందించాడు
రన్ రాజా రన్... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు... ఎక్స్‌ప్రెస్ రాజా... వరుసగా ఈ మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించారు శర్వానంద్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాైకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఈ సం్రక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయానందంలో ఉన్న శర్వా చెప్పిన ముచ్చట్లు...
సంక్రాంతి పండగ సందడి మీలో ఇంకా కనిపిస్తోంది?
పండగ సందడి ఎలానూ ఉంటుంది. దాంతోపాటు హిట్ తాలూకు ఆనందం కూడా ఉంటుంది కదా.
ముగ్గురు పెద్ద హీరోలతో పోటీ అంటే టెన్షన్ అనిపించలేదా?
ఇప్పటిదాకా నాకు సంక్రాంతి రిలీజ్ లేదు. ఇన్నేళ్లల్లో ఇదే మొదటిసారి. సినిమా మీద నమ్మకంతో సంక్రాంతికి వచ్చాం.
హీరోగా చాన్స్ అంటేనే కష్టం.. పేరు తెచ్చుకోవడం ఇంకా కష్టం. సంక్రాంతి రేస్‌కి రావడమంటే చాలా కష్టం కదా?
అవునండి. యాక్చువల్‌గా సంక్రాంతి రిలీజ్‌లో నా సినిమా ఉండాలనే కోరిక ఉండేది. యువీ క్రియేషన్స్‌లో సినిమా చేయడం వల్ల లక్కీగా అది నెరవేరింది. వంశీ, ప్రమోద్ సినిమా స్టార్ట్ చేసినప్పట్నుంచీ ‘మనం సంక్రాంతికి వస్తున్నాం’ అనేవారు.
నటుడిగా మీరు బెస్ట్ కాబట్టి, పెద్ద స్పాన్ ఉన్న కథలు చేస్తే, ఇమేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కదా?
నాకోసం కథలు రాయమని ఎవర్నీ అడగను. నా దగ్గరకొచ్చే దర్శకుడు నన్నెలా చూపించాలనుకుంటారో అలా కనిపిస్తా. ఒకవేళ పెద్ద స్పాన్ ఉన్న కథలు వస్తే చేస్తా. నా సినిమా చూడాలంటే కథలో కంటెంట్ ఉండాలి. లేకపోతే ప్రేక్షకులు నా సినిమా ఎందుకు చూడాలి? ‘శర్వా సినిమాలో కంటెంట్ ఉంటుంది’ అని నమ్మి, థియేటర్‌కి వచ్చేవాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలనుకుంటాను.
మొదటిసారి ఈ చిత్రంలో బాగా డ్యాన్స్ చేసినట్లున్నారు?
డ్యాన్స్ అంటే టెన్షన్. చేయాల్సిందేనని ‘కలర్‌ఫుల్ చిలకా’ పాటకు గాంధీ చేయించాడు. అలా డ్యాన్స్ చేయడం ఇదే ఫస్ట్‌టైమ్.
ప్రభాస్ సినిమా బాగుందన్నారు.. మరి.. మీ క్లోజ్‌ఫ్రెండ్ రామ్‌చరణ్?
ప్రభాస్ అన్న అభినందించాడు. చరణ్ బెంగళూరులో ఉన్నాడు కాబట్టి, చూడలేదు. పాటలు చూసి, ‘ఏంట్రా ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేశావ్’ అన్నాడు.
అది సరే... మాస్ ఇమేజ్‌ని కోరుకోవడంలేదా.. పది మంది విలన్లను రఫ్ఫాడించాలని లేదా?
ఎందుకుండదండీ! ఉంటుంది. కానీ, అలాంటి కథలు రావాలి కదా. వస్తే చేస్తాను. ఇమేజ్ గురించి చెప్పాలంటే.. మాస్, క్లాస్ అని ప్రత్యేకంగా నేను దేన్నీ టార్గెట్ చేయడంలేదు.
ఇక్కడి హీరోలు తమిళంలో.. అక్కడివాళ్లు ఇక్కడా మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నారు. మీకు, ఒక్క ‘ఎంగేయుమ్ ఎప్పో దుమ్’ చిత్రంతోనే తమిళంలో మార్కెట్ పెరిగింది.. మరి అక్కడ?
ఆ సినిమా తర్వాత తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగు చిత్రాలతో బిజీ కావడంవల్ల చేయలేకపోయాను. ఈ ఏడాది చివర్లో ఓ తమిళ సినిమా కమిట్ అవుతా.