శ్రీనివాస్ను వ్యక్తిగతంగా కలుస్తా: పవన్ కళ్యాణ్ | fans safety is my priority, says pawan kalyan | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్ను వ్యక్తిగతంగా కలుస్తా: పవన్ కళ్యాణ్

Published Tue, Jan 6 2015 11:48 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

శ్రీనివాస్ను వ్యక్తిగతంగా కలుస్తా: పవన్ కళ్యాణ్ - Sakshi

శ్రీనివాస్ను వ్యక్తిగతంగా కలుస్తా: పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : గోపాల గోపాల’  సినిమా ఆడియో  కార్యక్రమం సందర్భంగా  శిల్పకళా వేదిక ఆవరణలో ఆదివారం జరిగిన సంఘటనపై హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో  స్పందించాడు. గుంటూరుకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీనివాస్పై  కొందరు యువకులు దాడి చేసి గొంతు కోసిన విషయం తెలిసిందే.

దీనిపై పవన్ స్పందిస్తూ  'నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరం.ఈ వార్త వినగానే నా మనసు చాలా కలచి వేసింది. అతను హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి' అని ట్విట్ చేశాడు. కాగా అభిమానుల భద్రతే తన ప్రాధాన్యత అని పవన్ పేర్కొన్నాడు.

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడి జరుగుతున్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను సేకరించారు.గొంతు కోసిన నిందితుడితో పాటు దాడికి పాల్పడ్డ వారి ఫొటోలను పోలీసులు మీడియాకు సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement