
శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్‌కు నిశ్చితార్థం జరిగిన తర్వాత చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి రద్దు అయింది. అప్పట్లో ఆ వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. పెళ్లి క్యాన్సిల్‌పై ఇటు నాగార్జున కుటుంబం కానీ, అటు జీవీకే కుటుంబం కానీ పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతం శ్రియా భూపాల్ పెళ్లి వార్తలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
త్వరలోనే శ్రియా భూపాల్ పెళ్లి చేసుకోబోతుందని, రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిన్‌దిత్‌తో ఆమె పెళ్లి నిశ్చయించినట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తలపై శ్రియా భూపాల్, ఆమె కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత, ఈ సమస్య పూర్తిగా సమసిపోవాలంటే శ్రియా భూపాల్‌కు త్వరగా పెళ్లిచేయడమే కరెక్ట్ అని వారి పెద్దలు భావించినట్టు తెలిసింది. కానీ అఖిల్ పెళ్లి మాత్రం ఇప్పుడు ఉండదని, హీరోగా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేయాలని నాగార్జున నిర్ణయించినట్టు టాక్.
Comments
Please login to add a commentAdd a comment