ప్రముఖ గాయకుడిపై వేధింపుల కేసు | FIR against singer Abhijeet Bhattacharya; woman accuses him of molestation | Sakshi
Sakshi News home page

ప్రముఖ గాయకుడిపై వేధింపుల కేసు

Published Fri, Oct 23 2015 9:46 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

ప్రముఖ గాయకుడిపై వేధింపుల  కేసు - Sakshi

ప్రముఖ గాయకుడిపై వేధింపుల కేసు

ముంబై:  బాలీవుడ్  ప్రముఖ గాయకుడు అభిజిత్ భట్టాచార్య  మరోసారి  వివాదంలో ఇరుక్కున్నాడు.  ప్రముఖ సింగర్ ఖైలేష్ ఖేర్ కచేరీలో తనను లైంగికంగా వేధించాడని  ఓ మహిళ అభిజిత్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అభిజిత్ పై పోలీసులు అత్యాచారయత్నం  కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే లోఖండ్వాలా లోని దుర్గాదేవి పూజా మండపంలో  గురువారం రాత్రి ఏర్పాటు చేసిన  కైలాష్  ఖేర్  సంగీత కార్యక్రమానికి  ఓమహిళ (34) హాజరైంది.  అక్కడ గాయకుడు అభిజిత్ తనను తాకరాని చోట తాకి లైంగికంగా  వేధించాడని ఆరోపించింది.  చేయి తీయమని వారించినా,  లక్ష్యపెట్టకుండా  మానసిక వేదనకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతోపాటు మహిళా వాలంటీర్  సహాయంతో తనను నెట్టి వేసి, బెదిరించాడంటూ ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది.  మహిళ ఫిర్యాదు ఆధారంగా  ఐపిసీలోని వివిధ సెక్షన్ల కింద అభిజిత్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు.

వరుసగా బాలీవుడ్ గాయకులు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. గతంలో ప్రముఖ బాలీవుడ్ గాయకులు మికాసింగ్, అంకిత్ తివారీతో పాటు అతని సోదరుడు అంకుర్ తివారీ  అత్యాచార కేసుల్లో అరెస్టయ్యారు.  కాగా ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో గాయకుడు అభిజిత్  కూడా ఒకరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement