‘సైరా’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident In Chiranjeevi Sye Raa Narasimhareddy Set | Sakshi
Sakshi News home page

‘సైరా’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published Fri, May 3 2019 8:00 AM | Last Updated on Fri, May 3 2019 1:41 PM

Fire Accident In Chiranjeevi Sye Raa Narasimhareddy Set - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్‌ ప్రస్తుతం కోకాపేటలోని అల్లు అరవింద్‌ ఫార్మ్‌ హౌస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరుగుతోంది. ఈ సెట్‌లో శుక్రవారం తెల్లవారుజామున అగ్రి ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సెట్‌ పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కావటంతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మెగా ఫ్యామిలీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement