మాస్‌ని మెస్మరైజ్ చేసేలా.... | First look of Balakrishna's upcoming film | Sakshi
Sakshi News home page

మాస్‌ని మెస్మరైజ్ చేసేలా....

Published Sat, Dec 6 2014 12:23 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

మాస్‌ని మెస్మరైజ్ చేసేలా.... - Sakshi

మాస్‌ని మెస్మరైజ్ చేసేలా....

బాలకృష్ణ మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అందుకు తగ్గట్టే పాత్రలను కూడా ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారాయన. ప్రస్తుతం సత్యదేవ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం పత్రికల వారికి విడుదల చేశారు. కళ్లజోడు, గళ్ల లుంగీతో మాస్‌ని మెస్మరైజ్ చేసేలా ఉన్నారు ఈ ఫస్ట్‌లుక్‌లో బాలయ్య. మాస్‌ని లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రం రూపొందుతోందని ఈ ఫస్ట్‌లుక్ చెప్పకనే చెబుతోంది. ఇందులో బాలకృష్ణ సీబీఐ ఆధికారిగా నటిస్తున్నారు.

ఇందులో ఆయన పాత్ర మూడు డైమన్షన్లతో అత్యంత శక్తిమంతంగా సాగుతుందని యూనిట్ సభ్యుల సమాచారం. 60 శాతం షూటింగ్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ కూడా ఈ చిత్రం పూర్తి చేసుకుంది. బాలకృష్ణకు జోడీగా త్రిష నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ‘లెజెండ్’ ఫేమ్ రాధికా ఆప్టే మరో కథానాయిక. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత, నిర్మాణం: ఎస్.ఎల్.వి.సినిమా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement