CBI official
-
ఢిల్లీ: సీబీఐ ఎదుట మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర హాజరు
-
సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల
న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో వీరిద్దరూ సీబీఐ విచారణకు హాజరయ్యారు. శ్రీనివాస్ అరెస్ట్ వ్యవహారంలో సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షులుగా హాజరవ్వాలని గంగుల, గాయత్రి రవికి సీబీఐ బుధవారం నోటీసులు జారీ చేసింది. కాగా కొవ్విరెడ్డి శ్రీనివాస్ గత మూడేళ్లుగా నకిలీ ఐపీఎస్‌గా చలామణి అవుతూ ఢిల్లీ స్థాయిలో రాయబారాలు సాగిస్తూ అనేకమందిని మోసం చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. దీంతో మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్లో శ్రీనివాస్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మున్నురుకాపు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవిని శ్రీనివాస్ ఫోటోలు దిగినట్లు సమాచారం. అలాగే ఓ గెట్ టూ గెదర్ కార్యక్రమంలోనూ వీరిని శ్రీనివాస్ కలిసినట్లు సీబీఐ చెబుతోంది. ఈ క్రమంలో వీరిద్దరికి శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలపై సీబీఐ ఆరా తీస్తోంది. నాకు నోటీసులు రాలేదు: బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫోన్స్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో రామ్మోహన్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై బొంతు రామ్మోహన్ స్పందించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడికీ వెళ్లలేదని అన్నారు. నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్‌ను ఓ ఫంక్షన్లో కలిసినట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు. తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీబీఐ నోటీసులు వస్తే సమాధానం ఇస్తానన్నారు. చదవండి: Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు -
మిషన్ చోక్సీ బృందం తిరుగుముఖం
న్యూఢిల్లీ: రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇప్పట్లో భారత్‌కు అప్పగించే అవకాశాలు కనిపించడం లేదు. డొమినికా దేశ ప్రభుత్వం చోక్సీని అప్పగిస్తే వెంట తీసుకువద్దామని ఆ దేశానికి వెళ్లిన ‘మిషన్ చోక్సీ’భారత అధికారుల బృందం స్వదేశానికి తిరిగి బయల్దేరింది. సీబీఐ అధికారిణి శారద రౌత్ నేతృత్వంలోని బృందం డొమినికాలో ఏడు రోజుల పాటు మకాం వేసింది. చోక్సీ తరఫు లాయర్లు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ విచారణ వచ్చే నెలకి వాయిదా పడడంతో 8 మంది సభ్యులతో కూడిన భారత్ బృందం తిరుగుముఖం పట్టింది. జూన్ 3 రాత్రి 8 గంటల ప్రాంతంలో డొమినికా విమానాశ్రయం నుంచి ప్రత్యేక ప్రైవేట్ జెట్ విమానంలో భారతీయ అధికారులు స్వదేశానికి బయల్దేరినట్టుగా ఆ దేశంలోని స్థానిక మీడియా వెల్లడించింది. డొమినికాలో చోక్సీపై రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఆంటిగ్వా నుంచి డొమినికా దేశానికి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలతో అరెస్టయిన కేసులో న్యాయస్థానం చోక్సీకి బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసు విచారణ ఈ నెల 14న జరగనుంది. మరోవైపు చోక్సీ లాయర్లు ఆయన కనిపించడం లేదంటూ హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణను జూలైకి వాయిదా పడింది. ఈ పరిణామాలతో చోక్సీని డొమినికా ప్రభుత్వం వెనువెంటనే భారత్‌కు అప్పగించే అవకాశాలు లేకపోవడంతో భారత్ బృందం వెనక్కి బయల్దేరింది. మరోవైపు కోర్టులో విచారణ సాగుతుండగా కొందరు నిరసనకారులు డొమినికాకు చోక్సీని ఎవరు తీసుకువచ్చారు? అని రాసి ఉన్న ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. 62 ఏళ్ల వయసున్న చోక్సీ తన ప్రియురాలితో కలిసి డొమినికాకు వచ్చి పట్టుబడ్డాడని కొందరు చెబుతూ ఉంటే, ఆయనని కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని చోక్సీ తరఫు లాయర్లు వాదిస్తున్నారు. 2018లో భారత ప్రభుత్వం కళ్లుగప్పి అంటిగ్వాకు పరారైన చోక్సీ మే 23న అంటిగ్వాలో కనిపించకుండా పోయారు. డొమినికాలో పోలీసులకు పట్టుబడ్డారు. -
మాస్‌ని మెస్మరైజ్ చేసేలా....
బాలకృష్ణ మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అందుకు తగ్గట్టే పాత్రలను కూడా ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారాయన. ప్రస్తుతం సత్యదేవ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం పత్రికల వారికి విడుదల చేశారు. కళ్లజోడు, గళ్ల లుంగీతో మాస్‌ని మెస్మరైజ్ చేసేలా ఉన్నారు ఈ ఫస్ట్‌లుక్‌లో బాలయ్య. మాస్‌ని లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రం రూపొందుతోందని ఈ ఫస్ట్‌లుక్ చెప్పకనే చెబుతోంది. ఇందులో బాలకృష్ణ సీబీఐ ఆధికారిగా నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర మూడు డైమన్షన్లతో అత్యంత శక్తిమంతంగా సాగుతుందని యూనిట్ సభ్యుల సమాచారం. 60 శాతం షూటింగ్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ కూడా ఈ చిత్రం పూర్తి చేసుకుంది. బాలకృష్ణకు జోడీగా త్రిష నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ‘లెజెండ్’ ఫేమ్ రాధికా ఆప్టే మరో కథానాయిక. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత, నిర్మాణం: ఎస్.ఎల్.వి.సినిమా.