‘ఉడ్తా పంజాబ్’కు తప్పని కష్టాలు
లాహోర్: భారత్‌లో సెన్సారు బోర్డుతో విభేదాల అనంతరం కోర్టు జోక్యంతో విడుదలైన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రానికి పాకిస్థాన్‌లోనూ సెన్సార్ కట్లు తప్పడం లేదు. భారత సెన్సారు బోర్డు 89 కట్లు ప్రతిపాదిస్తే, పాకిస్థాన్ బోర్డు ఏకంగా 100 చోట్ల సినిమాలో కత్తెర పడాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఈ సినిమాలో పాకిస్థాన్‌కు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న అన్ని సీన్లు, డైలాగ్‌లను తొలగించడం, నిశ్శబ్దం లేదా బీప్ శబ్దాలతో నింపడం చేయాలని డిస్ట్రిబ్యూటర్‌కు పాక్ సెన్సార్‌బోర్డు ఆదేశాలిచ్చింది. అభ్యంతరకర విషయాల తొలగింపు తర్వాత మరోసారి బోర్డు సినిమాను పరిశీలించి విడుదలకు అనుమతినిస్తుంది. పాక్‌లో ఈ వారాంతంలో చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.