
సాక్షి,సిటీబ్యూరో: ఇపుడంతా వెబ్ సిరీస్‌ల ట్రెండ్.. సినిమాలు, టీవీ సీరియల్స్‌ని మించి ఇవి పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్ ద్వారా అందరి మొబైల్, కంప్యూటర్లకు చేరుతున్నాయి. అందుకే వెబ్‌సీరీస్‌లను జాతీయ, అంతర్జాతీయ ప్రొడక్షన్ హౌస్‌లు ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలో జీ నెట్‌వర్క్ కూడా తమ వెబ్‌సీరిస్‌లను ప్రారంభించింది. తొలి వెబ్‌సీరీస్ నాన్న కూచికి మంచి రెస్పాన్స్ రావటంతో, చిత్ర విచిత్రం పేరుతో రెండవ వెబ్‌సీరీస్‌ని ప్రారంభించింది జీ5.
చిన్ననాటి స్నేహితులు అభి సిద్దూ చాలా ఏళ్లకి ఒక ఫిలిం ప్రాజెక్టు వల్ల కలుస్తారు, ఆ క్రమంలో వారి కాలేజ్ జీవితాన్ని మరోసారి గుర్తుచేసుకోవడం ఈ సీరిస్ వృత్తాంతం. పది ఎపిసోడ్‌లున్న ఈ సీరిస్‌ని జీ5 యాప్, వెబ్ ద్వారా చూడవచ్చని ఈ సీరిస్ దర్శకుడు రమేశ్ తెలిపారు. ఇందులో నటిస్తున్నప్పుడు కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయని యాంకర్ రవి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి, సీరిస్ దర్శకుడు రమేశ్, డిఓపి సజీశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment