2011లో మొదలైన ఒక సంచలనం ఏడేళ్లుగా అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఆ సంచలనం పేరే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’. 2011లో మొదలైందీ టీవీ సిరీస్. ఒక్కో ఏడాది ఒక్కో సీజన్‌తో ఇప్పటికి ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ని అభిమానులు ముద్దుగా ‘జీఓటీ’ అని పిలుచుకుంటారు. కోట్లల్లో ఉన్న అభిమానులు, సినిమాలకు మించి ఉన్న క్రేజ్, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, కట్టిపడేసే కథ.. ఇవన్నీ కలిపి జీఓటీకి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. గతేడాది వచ్చిన సీజన్ 7 అయితే అభిమానులకు ఒక పండగలానే వచ్చి వెళ్లింది. సీజన్ 7 అయిపోవడమే అభిమానులంతా సీజన్ 8 కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇండియన్ సినిమా అభిమానులకు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ పిచ్చి పట్టిందంటే, అది గత రెండేళ్లుగానే!
సీజన్ 8కు ఉన్న క్రేజ్‌కు మరో కారణం అంటే అది చివరి సీజన్ కావడం కూడా! సీజన్ 8తో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ అయిపోతుంది. దీంతో ఇప్పటివరకూ చూసిన అన్ని సీజన్స్‌లోకి ది బెస్ట్ అనిపించేలా ఇప్పుడొచ్చే సీజన్ ఉండాలని ప్లాన్ చేస్తోంది టీమ్. ఈ క్రమంలోనే 2018లోనే సీజన్ 8ను ప్లాన్ చేసినా ఇప్పుడది 2019కి షిఫ్ట్ అయింది. ఇప్పటివరకూ 2011 నుంచి ఏడేళ్లుగా ప్రతి ఏడాదీ ఒక సీజన్ వచ్చింది. ఇప్పుడు సీజన్ 8.. 2019కి వెళ్లిపోవడంతో ఫస్ట్‌టైమ్ బ్రేక్ వచ్చినట్టు. అయితే ఆ బ్రేక్ తీస్కోవడానికి కూడా కారణం ఉందట. ఫైనల్ గేమ్ మేకింగ్‌కు మరి ఆ మాత్రం టైమ్ పడుతుంది. ఎంత లేటైనా ఎండింగ్ అదిరిపోవాలి అని!!
ఫైనల్ గేమ్ 2019లోనే!
Published Mon, Jan 8 2018 12:41 AM | Last Updated on Mon, Jan 8 2018 12:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment