లక్ అంటే ఏంటి? మనం అనుకున్న పనిలో ఈజీగా సక్సెస్ అవ్వడం. అనుకోకుండా సక్సెస్ వరించడం. హార్డ్‌వర్క్ చేసినప్పుడు అది వృథా కాకూడదంటే లక్ తోడవ్వాలి. అప్పుడు లక్ మన వెంటే ఉన్నట్లు లెక్క. హన్సిక ఇంకో లక్ గురించి చెబుతున్నారు. ఇతరులకు సహాయం చేసే స్థాయిలో ఉండటం కూడా లక్ అంటున్నారామె. ఈ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ – ‘‘మనకి కావల్సినవన్నీ మనకు సమకూరినప్పుడు తోటి వారికి కొంచెం సాయపడాలనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. నిజానికి యాక్టర్ అయ్యాక సర్వీస్ చేయడం అలవాటు కాలేదు.
చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేదాన్ని. ఇదంతా మా అమ్మ నుంచే వచ్చింది అనుకుంటున్నాను. అమ్మకి సేవాగుణం ఎక్కువ. ఇలా సహాయపడటం కూడా దేవుడు మాకిచ్చిన అదృష్టం అని నమ్ముతాను’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గోపీచంద్‌తో చేసిన ‘గౌతమ్ నందా’ తర్వాత తెలుగులో కనిపించలేదీ భామ. నితిన్‌తో వెంకీ కుడుముల రూపొందించనున్న ‘భీష్మా : ది బ్యాచిలర్’ చిత్రంలో హీరోయిన్‌గా హన్సికను సంప్రదించారని టాక్. ఒకవేళ ఈ సినిమాలో హన్సిక నటిస్తే.. 2010లో రిలీజ్ అయిన ‘సీతారాముల కల్యాణం’ తర్వాత ఎనిమిదేళ్లకు నితిన్, హన్సిక కలసి నటించే చిత్రం ఇదే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment