నాని డైరెక్టర్తో ఎన్టీఆర్ సినిమా | Hanu ragavapudi next movie with ntr | Sakshi
Sakshi News home page

నాని డైరెక్టర్తో ఎన్టీఆర్ సినిమా

Published Sun, Feb 21 2016 1:32 PM | Last Updated on Wed, Aug 29 2018 9:26 PM

నాని డైరెక్టర్తో ఎన్టీఆర్ సినిమా - Sakshi

నాని డైరెక్టర్తో ఎన్టీఆర్ సినిమా

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రెండో సినిమాతోనే ఘన విజయం సాధించిన ఈ డైరెక్టర్తో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంతో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమా పూర్తయిన తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడట.

అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హను, ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని తన మార్క్ చూపిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement