షూట్‌ చెయ్‌... మెడల్‌ కొట్టు! | Harshvardhan Kapoor will star as Olympic gold medalist Abhinav Bindra in biopic | Sakshi
Sakshi News home page

షూట్‌ చెయ్‌... మెడల్‌ కొట్టు!

Published Thu, Sep 7 2017 12:35 AM | Last Updated on Tue, Sep 19 2017 12:55 PM

షూట్‌ చెయ్‌...  మెడల్‌ కొట్టు!

షూట్‌ చెయ్‌... మెడల్‌ కొట్టు!

2008... చైనా రాజధాని బీజింగ్‌లో రసవత్తరంగా జరిగిన ఒలింపిక్స్‌ గుర్తుండే ఉంటాయి. ఆ క్రీడల్లో భారతీయ షూటర్‌ అభినవ్‌ బింద్రా గన్‌ టార్గెట్‌ను రీచ్‌ అయ్యింది. ఇండియా ఖాతాలో గోల్డ్‌ మెడల్‌ వచ్చి చేరింది. ఆ క్షణం పౌరుల మనసంతా గర్వంతో ఉప్పొంగింది. ఇప్పుడా క్షణాలను వెండి తెరపై ఆవిష్కరించేందుకు  బాలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి.

అభినవ్‌ బింద్రా బయోపిక్‌లో అనిల్‌ కపూర్‌ తనయుడు హర్షవర్థన్‌కపూర్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని హర్షవర్థన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ప్రపంచ వేదిక మీద జాతీయ గర్వాన్ని ఉప్పొంగేలా చేసిన వ్యక్తి క్యారెక్టర్‌లో నటించబోతున్నాను. అభినవ్‌ బింద్రా క్యారెక్టర్‌లో యాక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది. లెజెండ్‌ అయిన ఆయన పాత్రకు న్యాయం చేస్తానన్న నమ్మకం ఉంది’’ అన్నారు హర్షవర్థన్‌. రీల్‌పై అసలు సిసలైన షూటర్‌గా కనిపించడానికి ఈ హీరోగారు కసరత్తులు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement