మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కంచె' దసరా కానుకగా అక్టోబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 'కంచె' ట్రైలర్తో అభిమానుల్లో అంచనాలను పెంచేయగా.. తాజాగా మంగళవారం సాయంత్రం హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో మరో బ్రాండ్ న్యూ ట్రైలర్ను విడుదల చేశారు. దీంతో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది.
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాలతో కమర్షియల్ కథలకు భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ చాలా కాలం తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా 'కంచె'. గతంలో తెలుగులో ఎన్నడూ రాని ఓ సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమా ఉంటుందని క్రిష్ ఇంతకుముందే చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఓ సైనికుడి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెగా హీరో వరుణ్ కెరీర్కి మంచి ఫ్లస్ అవుతుందని భావిస్తున్నారు.
Here you go the new release trailer of #Kanche #KancheOnOct22 http://bit.ly/KancheOn22
— #KancheOnOct22nd (@IAmVarunTej) October 20, 2015