హైవే థ్రిల్లర్!
రహదారిలో ప్రమాదాలు, ఘోరాలు ఎప్పుడైనా ఊహించని విధంగా జరగొచ్చు. సరిగ్గా ఓ అయిదుగురు వ్యక్తులకు ఓ హైవే మీద ఎదురైన అనుకోని సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రహదారి’. రాజ్, సేదు, పూజ ముఖ్యతారలుగా శ్రేయాస్ మీడియా పతాకంపై రాజ్ దర్శకత్వంలో జి.శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ మణి, సంగీతం: రాహుల్ రాజ్.