నాకు పెళ్లీ కాలేదు... పిల్లలూ లేరు!
అంజలికి పెళ్లయ్యింది... పిల్లలు కూడా ఉన్నారు...! ఏంటీ? ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? అంజలి మాటమాత్రంగా కూడా బయటపెట్టలేదే అనుకుంటున్నారా? పాపం... ఈ మాటలతో అంజలికి సంబంధం లేదు. ఆమె గురించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త ఇది. ఈ వార్త విన్న అంజలి ఒక్కసారిగా నవ్వుకున్నారు. ‘నాకు పెళ్లి కాలేదు.. నేను సింగిల్...’ అని పేర్కొన్నారామె. మరి.. పిల్లలు ఉన్నారనే వార్త ఎలా వచ్చింది? అనే విషయానికొస్తే... ఆ మధ్య ఎప్పుడో తన మేనకోడలితో ఆమె ఫొటో దిగారట.
ఆ ఫొటో బయటికొచ్చింది. దాంతో... ఆ ఫొటోలో అంజలితో ఉన్న పాప ఆమె కూతురే అని ఫిక్స్ అవడంతో పాటు, ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అసలు సంగతి అదన్నమాట.