నా పాలసీ మార్చుకున్నా
నా పాలసీ మార్చుకున్నా
Published Sun, Mar 9 2014 1:10 AM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM
నిత్యం వార్తల్లో ఉంటున్న హీరోయిన్ల జాబితాలో నటి కాజల్ అగర్వాల్ కూడా చేరారు. ఈ బ్యూటీపై ఇటీవల హాట్ హాట్ ప్రచారమే జరుగుతోంది. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్స్‌తో ఎక్కువగా షికార్లు కొట్టడం, చెల్లెలి పెళ్లి ముందుగా జరగడంతో తన పెళ్లిపై బెంగపెట్టుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య దోష నివారణకు శ్రీకాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించడం పెళ్లిపై ఆమె ఆరాటం కనిపిస్తోంది. చిత్రాల సంఖ్యను కూడా అనూహ్యంగా తగ్గించుకోవడం చర్చనీయాంశంగా మారింది. తమిళంలో తుపాకీ, జిల్లా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మరో రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మరో పక్క ఆమె తల్లిదండ్రులు వరుని అన్వేషణలో ముమ్మరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అందుకే చిత్రాలను తగ్గించుకుంటున్నారా? అన్న ప్రశ్నకు కాజల్ అగర్వాల్ బదులిస్తూ చిత్రాల సంఖ్య కంటే మంచి పాత్రలను ఎంచుకుని నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక సమయంలో ఒకేసారి ఐదారు చిత్రాలు అంగీకరించి ఒక చిత్రం షెడ్యూల్ పూర్తి కాగానే మరో చిత్ర షూటింగ్‌లో పాల్గొనడం చేశానన్నారు. ప్రస్తుతం ఆ పాలసీని మార్చుకున్నానని తెలిపారు. ఒక చిత్రం చేసినా అందులో మంచి పాత్ర అయ్యి ఉండాలన్నారు. ఇప్పుడు ఎక్కువగా విహార యాత్రలు చేస్తున్నట్లు చెప్పారు. పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నట్లు అదేవిధంగా కుటుంబ సభ్యులతో అధికంగా గడుపుతున్నానని, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల నిధుల సమకూర్చే కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఆసక్తి చూపిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement