సీనియర్స్‌తో రొమాన్స్‌కు నో | I don't want to do Romance with Old heroes : shriya saran | Sakshi
Sakshi News home page

సీనియర్స్‌తో రొమాన్స్‌కు నో

Published Sun, Apr 27 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

సీనియర్స్‌తో రొమాన్స్‌కు నో

సీనియర్స్‌తో రొమాన్స్‌కు నో

 సీని యర్ హీరోల సరసన నటించడానికి నటి శ్రీయ ససేమిరా అంటున్నా రు. హీరోయిన్‌గా దశాబ్దం పాటు ఏలిన ఈ బ్యూటీ ఒకప్పుడు రజనీకాంత్ సరసన శివాజీ, విజయ్‌కు జంటగా అళగియ తమిళ్ మగన్ వంటి భారీ చిత్రాల్లో నటించి ప్రముఖ నటిగా వెలుగొందారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మార్కెట్ ఏమంత ఆశాజనకంగా లేదు. కోలీవుడ్‌లో అయితే ఒక్క అవకాశం కూడా లేదు. తెలుగు, కన్నడం భాషల్లో వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని నటిస్తున్నారు. అలాంటిది సీనియర్ హీరోల సరసన నటించడానికి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. శాండిల్‌వుడ్‌లో రవిచంద్రన్ మంచి పేరున్న నటుడు. ఒకప్పుడు భారీ చిత్రాల హీరో, నిర్మాత కూడా.
 
 తమిళంలోను పరువరాగం, పొయ్ ముఖంగళ్ తదితర చిత్రాల్లో నటించారు. ఈయన సరసన బాలీవుడ్ నటి జూహీచావ్లా, శిల్పాశెట్టి, ఖుష్బూ తదితర ప్రముఖ హీరోయిన్లు జతకట్టారు. అలాంటి హీరో ప్రస్తుతం కొత్త హీరోల రాకతో కాస్త వెనుకపడ్డమాట వాస్తవమే. అయినా ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నారు. తాజాగా రవిచంద్రన్ శ్రీరుంగారమ్మ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం శ్రీయను వరించింది. ఈమె ఇప్పటికే కన్నడంలో కొన్ని చిత్రాల్లో నటించారు. తాజాగా రవిచంద్రన్ సరసన నటించడానికి నిరాకరించారు. ఆయనకు హీరోగా మార్కెట్‌లేదని, వయసు మళ్లిన నటుడని శ్రీయ ఆయనతో రొమాన్స్‌కు నో అన్నట్లు సమాచారం. అయితే శ్రీయ అవకాశాన్ని నటి లక్ష్మీరాయ్ ఎగరేసుకుపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement