మహేశ్తో ఛాన్స్ జస్ట్ మిస్ | I really wanted to work with Mahesh, but just could not find the time | Sakshi
Sakshi News home page

మహేశ్తో ఛాన్స్ జస్ట్ మిస్

Published Tue, Jun 30 2015 11:56 AM | Last Updated on Tue, Aug 28 2018 5:11 PM

మహేశ్తో ఛాన్స్ జస్ట్ మిస్ - Sakshi

మహేశ్తో ఛాన్స్ జస్ట్ మిస్

హైదరాబాద్ : ప్రిన్స్ మహేశ్ బాబు పక్కన నటించాలని ఎవరికుండదు? ఆ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి  చేజారి పోతే అప్పుడు కలిగే 'అప్సెట్' అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇదే పరిస్థితి పాపం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కి ఎదురైంది. దీంతో అమ్మడు తెగ ఫీలైపోతుంది. ప్రిన్స్ మహేశ్తో పని చేయచేయాలని నిజంగా అనుకున్నాను... కానీ కాలం కలసి రాలేదు అంతే... అయితే ఆ సమయం ఎప్పుడు వస్తుందో అని రకుల్ ఒక్కటే బుగ్గలు నొక్కుకుంది.

ఇదంతా ఎందుకంటే... క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా పేరు పడిన చంటి అడ్డాల దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'బ్రహ్మోత్సవం' తెరకెక్కుతుంది. ఆ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లుగా సమంతా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక చేశారు. ఆ చిత్ర  షూటింగ్ జులై నుంచి ప్రారంభం కానుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్కు ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్లో సినిమాలకు ఒప్పుకుంది. అందులోభాగంగా ఇప్పటికే రామ్ చరణ్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.

ఆ తర్వాత వెంటనే ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం ప్రారంభమవుతుంది.  ఆ వెంటనే అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కుతుంది. వరుస చిత్రాలతో మహేశ్ చిత్రంలో నటించేందుకు డేట్స్ ఎడ్జెస్ట్ కాలేదని రకుల్ ప్రీత్ మంగళవారం వెల్లడించింది. దీంతో బ్రహ్మోత్సవంలో మహేశ్ పక్కన నటించే అవకాశం అందినట్లే అంది జస్ట్ మిస్ అయిందని వాపోయింది. అయితే తన అభిమాన నటుల్లో అల్లు అర్జున్ ఒకరని చెప్పింది. ఆయనతో నటించే అవకాశం ఇచ్చినందుకు బోయపాటికి కృతజ్ఞతలు చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement