'చిరంజీవి చెప్పకపోతే జంజీర్ ను నిరాకరించేవాడ్ని'
బాలీవుడ్‌లో ’విజయ్’ అనే పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పాత్ర పేరు వింటేనే సినిమాలో విలన్లకు సింహస్వప్పం. ఇక విజయ్ పాత్ర పేరుపై పెటెంట్ హక్కులన్నిసూపర్‌స్టార్ అమితాబ్‌కే. విజయ్ పాత్రతో అమితాబ్ సాధించిన విజయాలు కూడా ఎక్కువే. విజయ్ పాత్రతో బాలీవుడ్‌లో అమితాబ్ ఓ ట్రెండ్ సృష్టించారు. ఎన్నో ప్రత్యేకతల్ని అమితాబ్‌కు సంపాదించి పెట్టిన విజయ్ పాత్రతో జంజీర్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. అలాంటి పాత్ర టాలీవుడ్ హీరో రాం చరణ్ తేజను వెదుక్కుంటూ రావడమే కాకుండా బాలీవుడ్ అవకాశాన్ని కల్పించింది. దాంతో రాంచరణ్ ఆలోచనలో పడ్డాడు.
ఓ దశలో జంజీర్ చిత్రాన్ని చేయకూడదని నిర్ణయం తీసుకునే సమయంలో మెగాస్టార్ చిరంజీవి జూనియర్ మెగాస్టార్‌కు ధైర్యాన్ని నూరిపోసి అంగీకరంచేలా చేశారు. ఇదే విషయాన్ని రాంచరణ్ ఇటీవల ఓ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జంజీర్ చిత్రానికి అంగీకరించడానికి తన తండ్రి కారణం అంటూ చెప్పాడు.
ఈ చిత్రం కోసం తనను సంప్రదించినప్పుడు సందిగ్ధంలో పడ్డానని, అమితాబ్ పోషించిన పాత్రపై చాలా అంచనాలు ఉంటాయని.. జంజీర్ చిత్రం చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నపుడు... నాలో విశ్వాసాన్ని నింపి..ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయని.. ఎక్కువ ఆలోచించక జంజీర్ చిత్రంలో నటించు అని చిరంజీవి తెలిపినట్టు రాంచరణ్ వెల్లడించాడు స్క్రిప్ట్ బాగాలేకుంటే తప్ప.. చిత్రాన్ని రిజెక్ట్ చేయకు అని చెప్పడంతో తాను జంజీర్ ను అంగీకరించాను అని చరణ్ తెలిపాడు.