
కెరీర్‌లో టాప్ ఫామ్‌లో ఉన్నారు తాప్సీ. హిందీ–తెలుగు–తమిళ భాషల్లో ఆమె ఎంచుకుంటున్న సినిమాలు భిన్నంగా ఉంటున్నాయి. సక్సెస్‌లు తెచ్చిపెడుతున్నాయి. లేటెస్ట్‌గా స్పోర్ట్స్ బయోపిక్‌లో తాప్సీ కనిపించబోతున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో మిథాలీ పాత్రను తాప్సీ చేయనున్నారని సమాచారం.
కెప్టెన్‌గా పలు విజయాలు అందించడంతో పాటు ఇండియా తరఫున ఎక్కువ పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రికార్డ్ సాధించారు. ఆమె బయోపిక్‌ను వయాకామ్18 సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు దర్శకుడు, మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. బ్యాట్‌తో బంతిని బౌండరీకు ఎలా పంపాలో ట్రైనింగ్ తీసుకోనున్నారు తాప్సీ. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇదివరకు తాప్సీ ‘సూర్మ’లో హాకీ ప్లేయర్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.