‘ఇందిర’ గా విద్యాబాలన్? | Indira Gandhi as' Vidya Balan? | Sakshi
Sakshi News home page

‘ఇందిర’ గా విద్యాబాలన్?

Published Fri, Jun 26 2015 11:24 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

‘ఇందిర’ గా విద్యాబాలన్? - Sakshi

‘ఇందిర’ గా విద్యాబాలన్?

ఇందిరాగాంధీ రాజకీయంగా ఎంత శక్తిమంతురాలో...ఆమె పాత్రను పోషించే నటి కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలి. సరిగ్గా ఇలాగే బాలీవుడ్ దర్శకుడు మనీష్ అనుకున్నట్టున్నారేమో....తాను రాసుకున్న కథకు విద్యాబాలన్‌కు కరెక్ట్‌గా సూటవుతారని భావించారు. అందుకే దర్శకుడు మనీశ్ ఈ కథను విద్యాబాలన్‌కు వినిపించారు.
 
 ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘‘మూడు నెలల క్రితమే నేనామెకు కథ చెప్పాను. ఆమెకు చాలా బాగా నచ్చింది. కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. స్క్రిప్ట్ కూడా రెడీ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘ఇందిర’ అనే టైటిల్ ఖరారు చేశాం. ఆమె ఒప్పుకుంటే ఇక షూటింగ్ చేయడమే ఆలస్యం’’ అని మనీష్ చెప్పారు.
 
 విద్యాబాలన్‌కు చాలా బాగా నచ్చిందని, కాకపోతే ఈ సినిమాలో కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నందున విద్యాబాలన్ కొద్దిగా ఆలోచనలో పడ్డారని వినికిడి. ఈ సినిమా ప్రారంభానికి గాంధీ కుటుంబం నుంచి అనుమతి కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మనీష్ ఈ సినిమా కోసం నిర్మాతను కూడా వెతుకుతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement