దుబాయ్ రోడ్లపై జాకీ | Jackie Chan wraps Dubai shoot of 'Kung Fu Yoga' | Sakshi
Sakshi News home page

దుబాయ్ రోడ్లపై జాకీ

Published Mon, Nov 2 2015 11:26 PM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM

దుబాయ్ రోడ్లపై జాకీ - Sakshi

దుబాయ్ రోడ్లపై జాకీ

వెండితెరపై జాకీ చాన్ చేసే ఫైట్స్ చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక, ఆయన ఫైట్స్‌ని ప్రత్యక్షంగా చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇటీవల దుబాయ్‌లో ఓ రహదారి వైపు వెళుతున్నవాళ్లకి అదే జరిగింది. ఆ రోడ్డు మీద అతి వేగంగా దూసుకెళుతున్న కార్లు జనాల కంటపడ్డాయి. అంత వేగంగా వెళుతున్న కార్లను కొంతమంది తమ కెమెరాలో బంధించారు. కట్ చేస్తే.. కార్లు ఆగాయి. వాటిలో ఓ కారులోంచి జాకీచాన్ దిగారు. అంతే.. ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అది నిజమా? కలా? అని తమను తాము గిచ్చి చూసుకున్నారు.

అప్పటివరకూ జరిగిన కార్ల హడావిడి అంతా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కుంగ్‌ఫూ యోగా’ కోసమే అని తెలిసి, విడుదలకు ముందే యాక్షన్ సీన్ చూసినందుకు సంబరపడిపోయారు. అక్కడున్నవాళ్లల్లో కొంతమంది ఆ యాక్షన్ దృశ్యాలను క్లిక్‌మనిపించారు కదా. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ దృశ్యాలు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికి 33 రోజుల పాటు జరిగింది. భారత్-చైనా దేశాల సంయుక్త నిర్మాణంలో స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement