
జాకీచాన్ తొలి త్రీడీ సినిమా
యాక్షన్ స్టార్ జాకీచాన్ కథానాయకునిగా రూపొందిన ‘పోలీస్ స్టోరీ 2013’ చిత్రం తెలుగులో అదే పేరుతో ఈ నెల 21న విడుదల కానుంది. ఇండో ఓవర్సీస్ ఫిలింస్ సమర్పణలో శ్రీ సాయిగణేశా క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న శిరసాని రత్నాంజన్ మాట్లాడుతూ -‘‘నిర్మాతగా నాకిది తొలి యత్నం. పోలీస్ స్టోరీస్‌కి ఆరవ భాగంగా రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో హాంకాంగ్‌లో విడుదలై, ఘనవిజయం సాధించింది. జాకీచాన్ గత చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఆయన నటించిన తొలి త్రీడీ సినిమా ఇదే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.