రిహార్సల్స్లో కత్తిపోటు.. నటుడి మృతి | Japanese actor killed by prop samurai sword | Sakshi
Sakshi News home page

రిహార్సల్స్లో కత్తిపోటు.. నటుడి మృతి

Published Wed, Feb 17 2016 11:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

రిహార్సల్స్లో కత్తిపోటు.. నటుడి మృతి

రిహార్సల్స్లో కత్తిపోటు.. నటుడి మృతి

ఓ జపనీస్ నాటకం కోసం చేస్తున్న రిహార్సల్స్ విషాదాంతమయ్యింది. కత్తి యుద్ధం నేపథ్యంలో జరిగే ఓ నాటకానికి రిహార్సల్స్ చేస్తున్న సమయంలో 33 ఏళ్ల డిగో కాషినో ప్రమాదవశాత్తు కత్తిపోటుకు గురయ్యాడు. ప్రమాదం తరువాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. టోక్యోలోని స్టూడియోలో రిహార్సల్స్ సెషన్ నడుస్తుండగా పదునైన కత్తి డిగో కడుపులో దిగటంతో ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనకు ప్రత్యక్షసాక్షులు లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర నటీనటులు, గాయపడిన తరువాత అతని కేకలు విని స్పందించారు. అయితే అతను ఎలా గాయపడ్డాడనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.దీంతో ఇది కేవలం ప్రమాదమేనా లేక మరేదైనా కుట్ర  ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గతం వారం ఇటాలియన్ ప్లే జరుగుతున్న సమయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రఫెల్ షూమేకర్ అనే ఇటాలియన్ నటుడు.. ఉరి సన్నివేశంలో నటిస్తుండగా ప్రమాదవశాత్తు ఉరితాడు బిగుసుకొని మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement