
ఏసుక్రీస్తు జీవిత కథ
ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా నిర్మించిన తాజా చిత్రం ‘తొలికిరణం’. పీడీ రాజు ప్రధాన పాత్రలో జె. జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇటీవల కీలక సన్నివేశాలను శ్రీశైలం అడవుల్లో చిత్రీకరించాం.
ఏసుక్రీస్తు సమాధి నుంచి వచ్చిన తర్వాత భూమిపై 40 రోజులు తిరిగారు. అప్పుడు జరిగిన అద్భుతాల్ని ఇప్పటి వరకూ ఎవరూ చూపలేదు. ఏసుక్రీస్తు తిరిగొచ్చిన అనంతరం ఏం చేశారు? ఎవర్ని కలిశారు? మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటి? అన్నదే ఈ చిత్ర కథాంశం. భానుచందర్ ముఖ్యపాత్రలో నటించారు. ఆర్‌పీ పట్నాయక్ పాటలు ప్రధానాకర్షణ. గుడ్ ఫ్రైడే కానుకగా ఈనెల 25న రిలీజ్‌కు సన్నా హాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.