
జాన్వీ కపూర్
ముంబై : ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ రాలేదు. కానీ ఆమె కనబడితే పిల్లలు, కుర్రాళ్లు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఆమె ఎవరో కాదు జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురిగానే ఆమె ఇంత ఫాలోయింగ్ సంపాదించేసుకున్నారు. జాన్వీ నటిస్తున్న తొలి చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘సైరత్’ మూవీ రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
అయితే ఈ శుక్రవారం జాన్వీకి ఒక సంఘటన ఎదురైంది. బాంద్రా ప్రాంతంలోని షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తూ జాన్వీ కనిపించేసరికి అక్కడి పిల్లలు, యువత ఆమెను పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. పిల్లల్ని చూసిన జాన్వీ సైతం ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది ఆమెతో ఫోటోలు దిగారు. అంతమంది చుట్టుముట్టినా కూడా.. జాన్వీ నవ్వుకుంటూనే వెళ్లి కారెక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.