విజయ్‌తో జ్యోతిక నటించడం లేదా?
ఇళయదళపతి విజయ్‌కు జంటగా జ్యోతిక నటించడం లేదా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి లేదనే సమాధానం వినిపిస్తోంది. విజయ్, దర్శకుడు అట్లీల కాంబినేషన్ లో తాజాగా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది విజయ్ 61వ చిత్రం. ఆయనకు జంటగా సమంత, కాజల్, జ్యోతిక నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర పాత్రల్లో సత్యరాజ్, ఎస్‌జే.సూర్య, వడివేలు, సత్యన్, కోవైసరళ నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. కాగా సూర్యను ప్రేమించి వివాహమాడిన తరువాత నటి జ్యోతిక నటన కు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే 36 వయదినిలే చిత్రం ద్వారా రీఎంట్రీ అయి న జ్యోతిక కథానాయకి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అదీ సొంత సంస్థ 2డీ ఫిలింస్ నిర్మించే చిత్రాల్లోనే నటిస్తున్నారు. ప్రస్తుతం మగళీర్ మట్టుం చిత్రంలో నటిస్తున్నారు.
కాగా విజయ్ 61వ చిత్రంలో జ్యోతిక ఒక నాయకిగా నటిస్తే బాగుంటు ందని దర్శకుడు అట్లీ భావించారట. అదే విషయాన్ని జ్యోతికను కలిసి విన్నవించగా ఆమె పాత్ర నచ్చితే నటిస్తానని మాటిచ్చారట. అయితే అట్లీ కథ వినిపించగా జ్యోతిక తన పాత్రకు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారట. అందుకు అంగీకరించిన దర్శకుడు అట్లీ ఆ తరువాత మళ్లీ జ్యోతికను కలవలేదని సమాచారం. కారణం జ్యోతిక పాత్ర కాస్త నెగిటీవ్ షేడ్స్ కలిగి ఉంటుందని, ఆ పాత్రను జ్యోతిక చెప్పినట్లు మార్చితే ఆ పాత్ర స్వభావం మారిపోతుందని అట్లీ భావించడంతో ఇప్పుడా పాత్ర కు వేరే నటిని ఎంపిక చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.