Ilayadalapati Vijay
-
విజయ్‌తో జ్యోతిక నటించడం లేదా?
ఇళయదళపతి విజయ్‌కు జంటగా జ్యోతిక నటించడం లేదా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి లేదనే సమాధానం వినిపిస్తోంది. విజయ్, దర్శకుడు అట్లీల కాంబినేషన్ లో తాజాగా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది విజయ్ 61వ చిత్రం. ఆయనకు జంటగా సమంత, కాజల్, జ్యోతిక నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర పాత్రల్లో సత్యరాజ్, ఎస్జే.సూర్య, వడివేలు, సత్యన్, కోవైసరళ నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. కాగా సూర్యను ప్రేమించి వివాహమాడిన తరువాత నటి జ్యోతిక నటన కు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే 36 వయదినిలే చిత్రం ద్వారా రీఎంట్రీ అయి న జ్యోతిక కథానాయకి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అదీ సొంత సంస్థ 2డీ ఫిలింస్ నిర్మించే చిత్రాల్లోనే నటిస్తున్నారు. ప్రస్తుతం మగళీర్ మట్టుం చిత్రంలో నటిస్తున్నారు. కాగా విజయ్ 61వ చిత్రంలో జ్యోతిక ఒక నాయకిగా నటిస్తే బాగుంటు ందని దర్శకుడు అట్లీ భావించారట. అదే విషయాన్ని జ్యోతికను కలిసి విన్నవించగా ఆమె పాత్ర నచ్చితే నటిస్తానని మాటిచ్చారట. అయితే అట్లీ కథ వినిపించగా జ్యోతిక తన పాత్రకు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారట. అందుకు అంగీకరించిన దర్శకుడు అట్లీ ఆ తరువాత మళ్లీ జ్యోతికను కలవలేదని సమాచారం. కారణం జ్యోతిక పాత్ర కాస్త నెగిటీవ్ షేడ్స్ కలిగి ఉంటుందని, ఆ పాత్రను జ్యోతిక చెప్పినట్లు మార్చితే ఆ పాత్ర స్వభావం మారిపోతుందని అట్లీ భావించడంతో ఇప్పుడా పాత్ర కు వేరే నటిని ఎంపిక చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
నంబర్‌వన్ అయితే హ్యాపీనే!
నంబర్‌వన్ స్థానం చేరువైతే సంతోషమే అంటున్నారు నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీని కోలీవుడ్ నటి అనాలో, మాలీవుడ్ నటి అనాలో తెలియదు. ఎందుకంటే తల్లి తమిళం, తండ్రి మలయాళం.అయితే కోలీవుడ్‌లో చాలా వేగంగా ఎదుగుతున్న నాయకి కీర్తీసురేశ్. నాలుగవ చిత్రంతోనే ఇళయదళపతి విజయ్‌తో డ్యూయెట్లు పాడే అవకాశాన్ని దక్కించుకున్న నటి ఈ భామ. ఇక ఇప్పుడు సూర్య, విశాల్ వంటి స్టార్ హీరోలతో రొమాన్్స చేసే అవకాశాలు వరించాయి.దీంతో కోలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్ కథానాయకిగా మారారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్న కీర్తీసురేశ్‌తో చిట్ చాట్. ప్ర: మాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా రంగప్రవేశం చేసి ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఎలా ఫీలౌతున్నారు? జ: నాన్న సురేశ్‌కుమార్ మలయాళంలో పెద్ద నిర్మాత. ఆయన నిర్మించిన చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమయ్యాను. అమ్మ తమిళ సినిమాకు సుపరిచితురాలన్న విషయం తెలిసిందే. ప్లస్ టూ పూర్తి చేసిన తరువాత నేనూ నటినవ్వాలని నిర్ణయించుకున్నాను.అయితే ఇంటిలో వ్యతిరేకించారు. డిగ్రీ చదవమన్నారు. వారి కోరిక మేరకు ఫ్యాషన్ టెక్నాలజీ చదివాను. ఆ తరువాత నటనకు అనుమతించారు.టాప్ హీరోయిన్ స్థాయిని ఎలా ఫీలవుతున్నారని అడుగుతున్నారు. సంతోషమే కదా. ప్ర: ఫ్యాష¯ŒS టెక్నాలజీ చదువు మీకిప్పుడు ఉపయోగపడుతుందా? జ. చాలా. నేను బయట కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ధరించే డ్రస్‌కు నేనే డిజైన్ చేసుకుం టాను. సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్లకు సూచనలు ఇస్తుంటాను. నా డ్రస్సింగ్ సెన్స్ బాగుం టుందని బయట చెప్పుకుంటుంటారు. ప్ర. మీ అమ్మ మేనక ఎమైనా టిప్స్ ఇస్తుంటారా? జ: టైమింగ్, డిసిప్లిన్ ఈ రెండు విషయాల గురించే అమ్మ చెడుతుంటారు. కథలు వినడం, కాల్షీట్స్ కేటాయించడం వంటివి నన్నే చూసుకోమంటారు. నేను నటించిన చిత్రాలు చూసి నా నటనను విమర్శించే తొలి వ్యక్తి అమ్మే. అయితే అభినందనలు మాత్రం నాకు నేరుగా చెప్పకుండా ఇతరుల వద్ద ప్రస్తావిస్తారు. ప్ర: హీరోలకు మీరు లక్కీ హీరోయి¯ŒS అటగా? జ: గత ఏడాది నేను తెలుగులో నటించిన నేను శైలజ, తమిళంలో నటించిన రజనీమురుగన్, తొడరి, రెమో మొదలయినవి మంచి విజయవంతమైన చిత్రాలుగా అమరాయి. ఇటీవల తెరపైకి వచ్చిన భైరవా చిత్రం విజయం సాధించడంతో నన్ను లక్కీ హీరోయిన్ అంటున్నారు.అయితే ఈ విజయ పయనాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత పెరిగింది. ప్రస్తుతం సూర్యకు జంటగా తానాసేర్న్‌ద కూటం, విశాల్ సరసన సండైకోళి–2 చిత్రాలు, తెలుగులో పవన్ ఒక చిత్రం అంటూ చాలా సెలెక్టెడ్ చిత్రాలను చేసుకుంటూ పోతున్నాను. బాబీసింహాకు జంటగా నటించిన పాంబుసట్టై చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇవన్నీ మంచి విజయాలను సాధిస్తాయనే నమ్మకం ఉంది. ఈ లక్కీ సెంటిమెంట్ కొనసాగాలని కోరుకుంటున్నాను. ప్ర: ప్రఖ్యాత నటీమణి సావిత్రి పాత్రలో నటించనున్నారటగా? జ: ఆ చిత్రంలో నటించమని నన్ను అడిగిన మాట నిజమే.అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ప్ర: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందాన అవకాశాలన్నీ ఎగరేసుకు పోతున్నారట? జ: అలాంటిదేమీలేదు. ఒకే సమయంలో పలు చిత్రాలను అంగీకరించి సాఫీగా సాగుతున్న నా నట జీవితాన్ని చిందరవందర చేసుకోవాలనుకోవడం లేదు. కష్టపడి సంపాదించుకున్న స్థాయిని నిలుపుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కాలనుకుంటున్నాను. ప్ర: భవిష్యత్ ప్రణాళికల గురించి? జ: నాకు ఫాస్ట్ గురించి బాధ లేదు. ఫ్యూచర్ గురించి ఆలోచించను. ప్రెజెంట్లో నేనేమి చేస్తున్నానన్నదే ముఖ్యం. జరగబోయేదేదీ మన చేతుల్లో ఉండదు. ప్ర: మీరు నంబర్ వన్ స్థానంపై గురి పెట్టారట? జ: అందరూ నంబర్‌ఒన్ స్థానం కోసమే ఆశపడతారు. అయితే అది ఒకరికే దక్కే పొజిషన్ . నా వరకూ నేను నా పాత్రలను చక్కగా పోషించాలి. అవి ఆడియన్స్ కు అప్పీల్ కావాలనే ఆశిస్తాను. మీరన్నట్లు నంబర్‌ఒన్ స్థానం లభిస్తే సంతోషమే. -
విజయ్, ధనుష్ కలయికలో చిత్రం?
కోలీవుడ్‌లో ఇక క్రేజీ ప్రాజెక్ట్ గురించి ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇళయదళపతి విజయ్, యువ నటుడు ధనుష్ కలయికలో ఒక భారీ చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నదే ఆ ప్రచారం. విజయ్ ప్రస్తుతం భైరవా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుంది. తదుపరి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు తెరి వంటి సూపర్‌హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. కాగా విజయ్ 61వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం తరువాత విజయ్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఒక చిత్రం రూపొందనుందనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. వీరి కలయికలోనూ తుపాకీ, కత్తి వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలు వచ్చాయన్నది గమనార్హం. ఆ తాజా చిత్రాన్ని నటుడు ధనుష్ నిర్మించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఇంతకు ముందు విజయ్ నటించిన కత్తి చిత్రాన్ని ధనుష్ నిర్మించాల్సిందట. అది కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా వేరే చేయి మారిందట. దీంతో విజయ్ 62వ చిత్రాన్ని ధనుష్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్‌లో టాక్ స్ప్రెడ్ అయ్యింది. ధనుష్ స్టార్ హీరోలపై కన్నేసినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే తన వుండర్‌బార్ ఫిలింస్ పతాకంపై తన మామ సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా కబాలి–2 చిత్రాన్ని పా.రంజిత్ దర్శకత్వంలో నిర్మించనున్నారన్న విషయం తెలిసిందే.ఆ తరువాత విజయ్‌తో చిత్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
ఇళయదళపతితో ముచ్చటగా..
ఇళయదళపతి విజయ్ 60వ చిత్రం భైరవా చిత్ర పాటలు ఆయన అభిమానుల్లో యమ జోష్‌ను నింపుతున్నాయి. చిత్రం సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విజయ్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న రెండవ చిత్రం ఇది. ఇంతకు ముందు తెరి సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అంతకు ముందు కత్తి చిత్రంలో సమంత విజయ్‌తో జత కట్టారన్న విషయం తెలిసిందే. ఆ చిత్రం ఎ విఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రంలోనూ ఇద్దరు కథానాయికలు ఉంటారట. అందులో ఒక హీరోయిన్ గా కాజల్‌అగర్వాల్ ఇప్పటికే ఎంపికైనట్లు సమాచారం. ఈ అమ్మడికి విజయ్‌తో ఇది మూడో చిత్రం అవుతుంది. ఇంతకు ముందు తుపాకీ, జిల్లా చిత్రాల్లో నటించారు. తాజా చిత్రంలో కాజల్‌తో పాటు సమంత మరో నాయకిగా నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. సమంత, టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. ఈ ప్రేమజంట వచ్చే ఏడాది ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతోంది. ఈ లోగా సమంత ఓ ఐదు చిత్రాలు చేసేయాలన్న నిర్ణయంతో ఉన్నారట. ఇప్పటికే తమిళంలో రెండు చిత్రాలు కమిట్ అయ్యారు. విజయ్ చిత్రం ఓకే అయితే మూడు చిత్రాలు అవుతాయి. ఇక మరో రెండు చిత్రాలు అంగీకరించి ఆ తరువాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. -
ఇలయదళపతితో మూడోసారి..
ఇలయదళపతి విజయ్‌తో మూడు సార్లు హీరోయిన్ గా నటించే లక్కీచాన్్స ఇప్పటివరకూ ఏ నటికీ దక్కలేదు. అలాంటి అదృష్టం కాజల్‌అగర్వాల్‌కు దక్కిందన్నది తాజా సమాచారం. నిజానికి లేట్‌గా అయినా లేటెస్ట్గా హిట్ పెయిర్‌గా పేరు తెచుకున్న జంట విజయ్, కాజల్. వారిద్దరు ఇంతకు ముందు తుపాకీ, జిల్లా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆ తరువాత తాజాగా మరోసారి రొమాన్్సకు సిద్ధం అవుతున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. విజయ్ ప్రస్తుతం తన 60వ చిత్రం భైరవాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. విజయా ప్రొడక్షన్్స సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి భరతన్ దర్శకుడు. కీర్తీసురేష్ నాయకి. చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. భైరవా సంక్రాంతికి బరిలోకి దిగనున్నారు. విజయ్ తన 61వ చిత్రానికి తయారవుతున్నారు. అట్లీ దర్శకత్వంలో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న భారీ చిత్రంలో విజయ్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. తెరి వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత విజయ్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇందులో నయనతారను నాయకిగా ఎంపిక చేయాలన్న ప్రయత్నాలు జరిగాయని తెలిసింది. అయితే అమ్మడు ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. తాజాగా నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటుందట. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీనొకరిని ఎంపిక చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం నూతన సంవత్సరం సందర్భంగా జనవరిలో సెట్‌పైకి వెళ్లనుంది. -
సూపర్‌స్టార్ అనుమతి కోరిన ఇళయదళపతి
సూపర్‌స్టార్ రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రంపైనా అంతే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం భైరవా చిత్రంలో నటిస్తున్నారు. విజయ ప్రొడక్షన్స పతాకంపై ప్రఖ్యాత దివంగత నిర్మాత బి.నాగిరెడ్డి దివ్యాశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ మధ్య రజనీకాంత్ చిత్రం 2.ఓ చిత్రీకరణ జరుపుకుంటున్న స్థానిక ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆవరణలోనే విజయ్ చిత్రం బైరవా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో విజయ్ సూపర్‌స్టార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ నటించిన చిత్ర రీమేక్‌లో నటించాలన్న కోరికను విజయ్ చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారన్నది గమనార్హం. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఇటీవల రజనీకాంత్‌ను కలిసిన సందర్భాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు సమాచారం. రజనీకాంత్ నటించిన అన్నామలై చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర రీమేక్‌లో నటించడానికి విజయ్ సూపర్‌స్టార్ అనుమతి పోందినట్లూ, అందుకు ఆయన పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. భైరవా చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ తాజాగా అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం అన్నామలైకి రీమేక్ అయ్యే అవకావం ఉందని, అలా కానీ పక్షంలో విజయ్ నటించే తదుపరి చిత్రం అన్నామలైకి రీమేక్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. -
వాళ్లతోనా..నో!
స్టార్ హీరోలతో రొమాన్‌సకు సూపర్ హీరోయిన్ నయనతార నో అంటున్నారన్నది పరిశ్రమ వర్గాల టాక్.ఆదిలోనే శరత్‌కుమార్ వంటి స్టార్ కథానాయకుడికి జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన నటి నయనతార. ఆ తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్ వంటి అగ్రహీరోలందరితోనూ నటించి ప్రస్తుతం అగ్రనాయకిగా ఎదిగారు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు స్టార్ హీరోలకు జంటగా నటించడానికి నయనతార నిరాకరిస్తున్నారన్నది టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది. తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నయనతార ఈ మధ్య నటించిన చిత్రాలన్నీ వరుసగా విజయం సాధిస్తున్నాయి. దీంతో ఆమెను తమ చిత్రాల్లో నటింపజేయడానికి ప్రముఖ కథానాయకులు, దర్శక-నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండగా నయనతార మాత్రం విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఆ మధ్య తెలుగులో వెంకటేశ్‌కు జంటగా బాబు బంగారం చిత్రంలో నటించిన నయనతారకు మోగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించే అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోలేదు. అదే విధంగా బాలకృష్ట చిత్రంలోనూ తొలి ఆఫర్ నయనకే వచ్చింది. ఆ అవకాశాన్నీ వదులు కున్నారు. ఇక పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించే అవకాశం నయనతార ఇంటి తలుపు తట్టినా, అధిక పారితోషికం ఆశ చూపినా నో అన్నారని సమాచారం. ఇదే విధంగా తమిళంలోనూ ప్రముఖ హీరోల సరసన నటించడానికి అంగీకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోల చిత్రాల్లో పాటలకు, ప్రేమ సన్నివేశాలకే తన పాత్రలను పరిమితం చేస్తున్నారని, అదే వర్ధమాన కథానాయకుల చిత్రాలైతే తన పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని నయనతార భావిస్తున్నట్లు తెలిసింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన మాయ చిత్రం, విజయ్‌సేతుపతికి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ వంటి చిత్రాలు కోలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురిపించడంతో తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచేసినట్లు ప్రచారంలో ఉన్న నయనతార ప్రస్తుతం తన పాత్ర చుట్టూ తిరిగే కథా పాత్రలో కూడిన ఇమైక్కా నోడిగళ్ చిత్రంలో యువ నటుడు అధర్వతోనూ, స్టార్ నటులు లేని దోరా చిత్రంలోనూ, గోపి నాయనార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కలెక్టర్‌గానూ నటిస్తున్నారు. తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు స్త్రీ పాత్ర ప్రధాన ఇతి వృత్తంగా రూపొందనున్న చిత్రాలను అంగీకరించినట్లు సమాచారం. ఇళయదళపతి విజయ్‌కి జంటగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగవి ఎంత వరకూ సఫలం అవుతాయో చూడాలి. -
శివాజీ ప్రొడక్షన్స్‌లో ఇలయదళపతి
ప్రఖ్యాత దివంగత నటుడు శివాజీగణేశ న్, రజనీకాంత్, కమలహాసన్, అజిత్ వంటి ప్రముఖ నటులు నటించిన శివాజీ ప్రొడక్షన్స్ సంస్థలో ఇప్పుడు ఇలయదళపతి విజయ్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. విజయ్ నటించిన తాజా చిత్రం తెరి ఇటీవల విడుదలై విజయవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల క్లబ్ దాటి 150 కోట్ల క్లబ్లో చేరిందంటున్నారు సినీ లెక్కల పండితులు. ప్రస్తుతం విజయ్ తన 60వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ సంస్థ విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి.వెంకటరామిరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇలయదళపతి 61వ చిత్రం ఏమిటన్న వారికి శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే చిత్రం కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. తెరి చిత్రంతో విజయ్‌కు అద్భుత విజయాన్ని అందించిన అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇక ఇందులో విజయ్‌కి జంటగా ఈ జనరేషన్‌కు చెందిన లక్కీ నటి నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెరి చిత్ర థ్యాంక్స్ మీట్లో దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రం గురించి త్వరలోనే వెల్లడిస్తామన్న విషయాన్ని పరిశీలిస్తే అది విజయ్‌తో శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న చిత్రమని భావించాల్సి ఉంటుంది. -
అభిమానుల ప్రోత్సాహం మరువలేనిది
ఆరంభకాలం నుంచి అభిమానులందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని ఇలయదళపతి విజయ్ వ్యాఖ్యానించారు. ఈయన నటించిన 59వ చిత్రం తెరి. ముద్దుగుమ్మలు సమంత, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ దర్శకతలో వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది ఆయనకు అర్ధ శత చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక రాయపేటలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. వందలాది మంది విజయ్ అభిమానుల ఈలలు, చప్పట్లు, కేరింతల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ మాట్లాడుతూ సాధారణంగా ఇలాంటి వేడుకల్లో సంగీత దర్శకులే హీరోలన్నారు. అయితే హీరో అయిన జీవీ ప్రకాశ్‌కుమార్‌నే ఆ చిత్రానికి సంగీత దర్శకుడు కావడం విశేషంగా పేర్కొన్నారు. జీవీ విర్జిన్ యువత హీరో అని వ్యాఖ్యానించారు. మహేంద్రన్ దర్శకత్వంలో అవకాశం కోసం ఇక దర్శకుల హీరోగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ అన్నారు. ఆయన పేరు చెప్పగానే గుర్తు కొచ్చే చిత్రం ముల్లుమ్ మలరుమ్ అన్నారు. ఉదిరిపూక్కళ్ లాంటి పలు గొప్ప చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్ దర్శకత్వంలో నటించే అవకాశం రాదా? అను ఎదురు చూస్తుండగా ఆయనే తన చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. సెల్ఫీ పుళ్ల కుల్ఫీ పుళ్ల ఇందులో ఇద్దరు బ్యూటీఫుల్ హీరోయిన్లు నటించారన్నారు. వారిలో ఒకరు సెల్ఫీ పుళ్ల సమంత కాగా కుల్ఫీ పుళ్ల ఎమీజాక్సన్ మరొకరనీ అన్నారు. వీరిద్దరికీ సమాన పాత్రలని తెలిపారు. ఇకపోతే రాజారాణి వంటి అందమైన ప్రేమ కథా చిత్రంతో విజయం సాధించిన దర్శకుడు అట్లీ తనతో మంచి కమర్షియల్ చిత్రం చేయాలన్న వెర్రితో తీసిన చిత్రమే ఈ తెరి అన్నారు.ఆయన చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. పులి లాంటి నిర్మాత మనం టీవీలో డిస్కవరి ఛానల్లో గుంపుగా ఉన్న జింకలో ఒక దానిపై గురి పెట్టిన పులి దాన్ని వెంటాడి చంపి తింటుందన్నారు. ఇక్కడ జింక విజయం అయితే దాన్ని వేటాడి సాధించే పులి నిర్మాత కలైపులి ఎస్.థాను అని వర్ణించారు. అలా విజయం కోసం వేటాడి సాధించే నిర్మాత ఆయనని అన్నారు. అభిమానులు ఉన్నత స్థాయికి ఎదగాలి ఇక తనకు ఆరంభ కాలం నుంచి అండదండగా నిలిచింది అభిమానులేనన్నారు. వారి ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరానన్నారు. తన అభిమానులూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నటి మీనా కూతురు నైనిక హైలైట్‌గా నిలిచారు. ఈ చిన్నారి తెరి చిత్రంలో విజయ్ కూతురుగా నటించింది. ఈ చిత్రం ఆడియోనూ తనే ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో నటి ఎమీజాక్సన్, మీనా, జీవీ ప్రకాశ్‌కుమార్,ప్రభు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
విజయ్ వెనకడుగు జీవీ ముందడుగు
ఇళయదళపతి విజయ్ వెనుకడుగేయడంతో యువ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ ముందుకు దూసుకొస్తున్నారు. ఏమిటీ కాస్త తికమకగా ఉందా? అయితే వివరాల్లోకెళదాం. విజయ్ నటిస్తున్న భారీ సోషల్ ఫాంటసీ కథా చిత్రం పులి. నటి శ్రీదేవి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. కన్నడ నటుడు సుదీప్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శింబుదేవన్ దర్శకత్వంలో పీటీ.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న పులి చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. దీంతో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చాలా చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నారు. అలా మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న చిత్రాల్లో త్రిష ఇల్లన్న నయనతార ఒకటి. కాగా పులి చిత్రం వీఎఫ్ఎక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో చిత్ర విడుదలను అక్టోబర్ ఒకటవ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో భలే చాన్స్‌లే లక్కీచాన్స్లే అన్నంత ఆనందంతో త్రిష ఇల్లన్న నయనతార చిత్రం సెప్టెంబర్ 17 విడుదలకు ముస్తాబవుతోందన్నది తాజా సమాచారం. జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన ఇందులో మనీషాయాదవ్,ఆనంది నాయికలుగా నటించారు. నటి సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించిన ఇందులో ఆర్య,ప్రియా ఆనంద్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్యామియో ఫిలింస్ సంస్థ నిర్మించింది. విశేషం ఏమిటంటే అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్ చిత్రం విడుదల తేదీ అనూహ్యంగా కొంచెం వెనక్కి వెళ్లడంతో జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించిన డార్లింగ్ చిత్రం అనూహ్యంగా విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు విజయ్ చిత్రం పులి వెనక్కు వెళ్లడంతో త్రిష ఇల్లన్న నయనతార ముందుగా తెరపైకి రానుంది. మరో విశేషం డార్లింగ్ చిత్రాన్ని విడుదల చేసిన స్టూడియోగ్రీన్ సంస్థనే ఈ త్రిష ఇల్లన్న నయనతార చిత్రాన్ని విడుదల చేయనుంది.మరి డార్లింగ్ మ్యాజిక్ ఈ సారి వర్కౌట్ అవుతుందా?అన్నది వేసి చూడాల్సిందే.