శివాజీ ప్రొడక్షన్స్‌లో ఇలయదళపతి | Sivaji Productions in Ilayadalapati Vijay | Sakshi
Sakshi News home page

శివాజీ ప్రొడక్షన్స్‌లో ఇలయదళపతి

Published Tue, May 3 2016 4:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

శివాజీ ప్రొడక్షన్స్‌లో ఇలయదళపతి

శివాజీ ప్రొడక్షన్స్‌లో ఇలయదళపతి

ప్రఖ్యాత దివంగత నటుడు శివాజీగణేశ న్, రజనీకాంత్, కమలహాసన్, అజిత్ వంటి ప్రముఖ నటులు నటించిన శివాజీ ప్రొడక్షన్స్ సంస్థలో ఇప్పుడు ఇలయదళపతి విజయ్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. విజయ్ నటించిన తాజా చిత్రం తెరి ఇటీవల విడుదలై విజయవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల క్లబ్ దాటి 150 కోట్ల క్లబ్‌లో చేరిందంటున్నారు సినీ లెక్కల పండితులు. ప్రస్తుతం విజయ్ తన 60వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రముఖ సంస్థ విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి.వెంకటరామిరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా ఇలయదళపతి 61వ చిత్రం ఏమిటన్న వారికి శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే చిత్రం కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. తెరి చిత్రంతో విజయ్‌కు అద్భుత విజయాన్ని అందించిన అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇక ఇందులో విజయ్‌కి జంటగా ఈ జనరేషన్‌కు చెందిన లక్కీ నటి నటించనున్నట్లు సమాచారం.

ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెరి చిత్ర థ్యాంక్స్ మీట్‌లో దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రం గురించి త్వరలోనే వెల్లడిస్తామన్న విషయాన్ని పరిశీలిస్తే అది విజయ్‌తో శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న చిత్రమని భావించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement