నంబర్‌వన్ అయితే హ్యాపీనే! | chit chat with Keerthi Suresh | Sakshi
Sakshi News home page

నంబర్‌వన్ అయితే హ్యాపీనే!

Published Mon, Feb 6 2017 6:17 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

నంబర్‌వన్ అయితే హ్యాపీనే!

నంబర్‌వన్ అయితే హ్యాపీనే!

నంబర్‌వన్  స్థానం చేరువైతే సంతోషమే అంటున్నారు నటి కీర్తీసురేశ్‌. ఈ బ్యూటీని కోలీవుడ్‌ నటి అనాలో, మాలీవుడ్‌ నటి అనాలో తెలియదు. ఎందుకంటే తల్లి తమిళం, తండ్రి మలయాళం.అయితే కోలీవుడ్‌లో చాలా వేగంగా ఎదుగుతున్న నాయకి కీర్తీసురేశ్‌. నాలుగవ చిత్రంతోనే ఇళయదళపతి విజయ్‌తో డ్యూయెట్లు పాడే అవకాశాన్ని దక్కించుకున్న నటి ఈ భామ. ఇక ఇప్పుడు సూర్య, విశాల్‌ వంటి స్టార్‌ హీరోలతో రొమాన్్స చేసే అవకాశాలు వరించాయి.దీంతో కోలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ కథానాయకిగా మారారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్న కీర్తీసురేశ్‌తో చిట్‌ చాట్‌.

ప్ర: మాలీవుడ్‌లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా రంగప్రవేశం చేసి ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఎలా ఫీలౌతున్నారు?
జ: నాన్న సురేశ్‌కుమార్‌ మలయాళంలో పెద్ద నిర్మాత. ఆయన నిర్మించిన చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమయ్యాను. అమ్మ తమిళ సినిమాకు సుపరిచితురాలన్న విషయం తెలిసిందే. ప్లస్‌ టూ పూర్తి చేసిన తరువాత నేనూ నటినవ్వాలని నిర్ణయించుకున్నాను.అయితే ఇంటిలో వ్యతిరేకించారు. డిగ్రీ చదవమన్నారు. వారి కోరిక మేరకు ఫ్యాషన్  టెక్నాలజీ చదివాను. ఆ తరువాత నటనకు అనుమతించారు.టాప్‌ హీరోయిన్  స్థాయిని ఎలా ఫీలవుతున్నారని అడుగుతున్నారు. సంతోషమే కదా.

ప్ర: ఫ్యాష¯ŒS టెక్నాలజీ చదువు మీకిప్పుడు ఉపయోగపడుతుందా?
జ. చాలా. నేను బయట కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ధరించే డ్రస్‌కు నేనే డిజైన్ చేసుకుం టాను. సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్లకు సూచనలు ఇస్తుంటాను. నా డ్రస్సింగ్‌ సెన్స్  బాగుం టుందని బయట చెప్పుకుంటుంటారు.

ప్ర. మీ అమ్మ మేనక ఎమైనా టిప్స్‌ ఇస్తుంటారా?
జ: టైమింగ్, డిసిప్లిన్  ఈ రెండు విషయాల గురించే అమ్మ చెడుతుంటారు. కథలు వినడం, కాల్‌షీట్స్‌ కేటాయించడం వంటివి నన్నే చూసుకోమంటారు. నేను నటించిన చిత్రాలు చూసి నా నటనను విమర్శించే తొలి వ్యక్తి అమ్మే. అయితే అభినందనలు మాత్రం నాకు నేరుగా చెప్పకుండా ఇతరుల వద్ద ప్రస్తావిస్తారు.

ప్ర: హీరోలకు మీరు లక్కీ హీరోయి¯ŒS అటగా?
జ: గత ఏడాది నేను తెలుగులో నటించిన నేను శైలజ, తమిళంలో నటించిన రజనీమురుగన్, తొడరి, రెమో మొదలయినవి మంచి విజయవంతమైన చిత్రాలుగా అమరాయి. ఇటీవల తెరపైకి వచ్చిన భైరవా చిత్రం విజయం సాధించడంతో నన్ను లక్కీ హీరోయిన్  అంటున్నారు.అయితే ఈ విజయ పయనాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత పెరిగింది. ప్రస్తుతం సూర్యకు జంటగా తానాసేర్న్‌ద కూటం, విశాల్‌ సరసన సండైకోళి–2 చిత్రాలు, తెలుగులో పవన్  ఒక చిత్రం అంటూ చాలా సెలెక్టెడ్‌ చిత్రాలను చేసుకుంటూ పోతున్నాను. బాబీసింహాకు జంటగా నటించిన పాంబుసట్టై చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇవన్నీ మంచి విజయాలను సాధిస్తాయనే నమ్మకం ఉంది. ఈ లక్కీ సెంటిమెంట్‌ కొనసాగాలని కోరుకుంటున్నాను.

ప్ర: ప్రఖ్యాత నటీమణి సావిత్రి పాత్రలో నటించనున్నారటగా?
జ: ఆ చిత్రంలో నటించమని నన్ను అడిగిన మాట నిజమే.అయితే ఇంకా ఫైనల్‌ కాలేదు.

ప్ర: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందాన అవకాశాలన్నీ ఎగరేసుకు పోతున్నారట?
జ: అలాంటిదేమీలేదు. ఒకే సమయంలో పలు చిత్రాలను అంగీకరించి సాఫీగా సాగుతున్న నా నట జీవితాన్ని చిందరవందర చేసుకోవాలనుకోవడం లేదు. కష్టపడి సంపాదించుకున్న స్థాయిని నిలుపుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కాలనుకుంటున్నాను.

ప్ర: భవిష్యత్‌ ప్రణాళికల గురించి?
జ: నాకు ఫాస్ట్‌ గురించి బాధ లేదు. ఫ్యూచర్‌ గురించి ఆలోచించను. ప్రెజెంట్‌లో నేనేమి చేస్తున్నానన్నదే ముఖ్యం. జరగబోయేదేదీ మన చేతుల్లో ఉండదు.

ప్ర: మీరు నంబర్‌ వన్ స్థానంపై గురి పెట్టారట?
జ: అందరూ నంబర్‌ఒన్  స్థానం కోసమే ఆశపడతారు. అయితే అది ఒకరికే దక్కే పొజిషన్ . నా వరకూ నేను నా పాత్రలను చక్కగా పోషించాలి. అవి ఆడియన్స్ కు అప్పీల్‌ కావాలనే ఆశిస్తాను. మీరన్నట్లు నంబర్‌ఒన్  స్థానం లభిస్తే సంతోషమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement