కోలీవుడ్‌కు కీర్తి చిన్న గ్యాప్‌ | Keerthy Suresh in Allu Arjun's Tamil Debut Movie | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు కీర్తి చిన్న గ్యాప్‌

Published Wed, Mar 29 2017 4:19 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

కోలీవుడ్‌కు కీర్తి చిన్న గ్యాప్‌

కోలీవుడ్‌కు కీర్తి చిన్న గ్యాప్‌

కోలీవుడ్‌కు చిన్న గ్యాప్‌ ఇవ్వాలని యువ నాయకి కీర్తీసురేశ్‌ నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్‌ వార్గాల తాజా సమాచారం. మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కు వచ్చిన ఈ బ్యూటీకి ఇక్కడ తొలి చిత్రం ఇదు ఎన్న మాయం చిత్రం నిరాశపరిచినా మలి చిత్రం రజనీమురుగన్, మూడో చిత్రం రెమో ఘన విజయాలనే అందించాయి. దీంతో ఏక్‌దమ్‌తో ఇళయదళపతితో రొమాన్స్‌ చేసే అవకాశం కీర్తీ తలుపు తట్టింది. విజయ్‌కు జంటగా నటించిన భైరవా చిత్రం తనను టాప్‌ హీరోయిన్‌గా నిలబెడుతుందని ఈ భామ కలలు కందనే చెప్పాలి.

 అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం సూర్య సరసన తానాసేర్న్‌దకూటం చిత్రంలో నటిస్తోంది. లింగుస్వామి దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ హీరోగా కోలీవుడ్‌కు పరిచయం అయ్యే చిత్రంలో కీర్తీనే హీరోయిన్‌ అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. దీంతో సూర్యతో నటిస్తున్న చిత్రం మినహా కోలీవుడ్‌లో మరో చిత్రం చేతిలో లేని పరిస్థితి. అయితే టాలీవుడ్‌లో ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.

 అక్కడ తొలి చిత్రం నేనూ శైలజ, ఇటీవల నానికి జంటగా నటించిన నేను లోకల్‌ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా పవన్‌కల్యాణ్‌కు జంటగా ఒక చిత్రం, మహానటి సావత్రి జీవిత చరిత్రతో తెరకెక్కినున్న చిత్రంతో పాటు మరో చిత్రంలోనూ నటించడానికి కీర్తీ రెడీ అవుతోంది. కాగా ఇలియానా, కాజల్‌అగర్వాల్, అనుష్కల నుంచి రకుల్‌ప్రీత్‌సింగ్‌ వరకూ పలువురు కథానాయికలు కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు వెళ్లి అక్కడ టాప్‌ హీరోయిన్‌గా రాణించి ఆ తరువాత కోలీవుడ్‌కు క్రేజీ ఆఫర్లతో అవకాశాలను అందుకున్న వాళ్లే.

 తాజాగా నటి కీర్తీసురేశ్‌ కూడా ఇదే బాణీని అవలంభించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే టోలీవుడ్‌లో భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తున్న ఈ అమ్మడు అక్కడ మరిన్ని అవకాశాలను రాబట్టుకోవాలన్న భావనతో కోలీవుడ్‌కు చిన్న గ్యాప్‌ ఇవ్వాలని నిర్ణయించుకుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మకాం వేసిందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement