కబాలి ఆడియో విడుదలెప్పుడు? | Kabali Audio Release? | Sakshi
Sakshi News home page

కబాలి ఆడియో విడుదలెప్పుడు?

Published Tue, May 10 2016 3:14 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

కబాలి ఆడియో విడుదలెప్పుడు? - Sakshi

కబాలి ఆడియో విడుదలెప్పుడు?

తమిళసినిమా: కబాలి.. ఇప్పుడు టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారిన చిత్రం ఇదే. దీనికి ఒకటి కాదు రెండు కాదు.. చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణం సూపర్‌స్టార్. స్టైల్‌కింగ్ రజనీకాంత్. చిన్న గ్యాప్ తరువాత ఆయన నటిస్తున్న పూర్తి కమర్షియల్ ఎంటర్‌టెయినర్ చిత్రం కబాలి. బాషా తరువాత ఆ తరహా గ్యాంగ్‌స్టర్‌గా రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కబాలి. ఇందులో ఆయన దాదాగా రెండు విభిన్న కోణాల్లో కనిపించే పాత్రలో నటించడం విశేషం. నటి రాధికా ఆప్తే నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి ధన్సిక, కళైయరసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

యువ దర్శకుడు రంజిత్ కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల యుట్యూబ్‌లో విడుదలైన కబాలి చిత్ర టీజర్ గత చిత్రాల రికార్డులను బద్దలు కొట్టేసింది. దీని వీక్షకుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరిగిపోతోంది. నాలుగు రోజులరే కోటిన్న దాటిందంటే సూపర్‌స్టార్ క్రేజ్ ఏపాటిదో, కబాలి చిత్రంపై ఆసక్తి ఎలా పెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. కబాలి చిత్ర టీజర్ చూసిన రజనీకాంత్ సుమ్మా అదిరింది కదూ అంటూ సంతృప్తిని వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్  సంతోషసాగరంలో మునిగి తేలుతోంది.

ఇప్పటి నుంచే ప్రపంచవ్యాప్త రజనీకాంత్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. చిత్రం విడుదల కోసం వారు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు.కాగా చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు కబాలి  చిత్ర ఆడియోను ఈ నెల చివరిలో విడుదల చేయడానికి భారీ ఎత్తున ప్రణాళిను సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం. చెన్నైలోని సత్యం సినీమాల్‌లో గానీ, నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గానీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మహించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement