గ్లామర్‌నే నమ్ముకుంటుందా? | Kajal Aggarwal Futuer Plans | Sakshi
Sakshi News home page

గ్లామర్‌నే నమ్ముకుంటుందా?

Published Sat, Jun 15 2019 10:08 AM | Last Updated on Sat, Jun 15 2019 10:08 AM

Kajal Aggarwal Futuer Plans - Sakshi

జీవితంలో ఎంతవారికైనా ఎత్తుపల్లాలు తప్పవు. నటి కాజల్‌ అగర్వాల్‌ ఇందుకు అతీతం కాదు. నిజం చెప్పాలంటే ఈ ఉత్తరాది బ్యూటీ నట జీవితం కోలీవుడ్‌లో అపజయాలతోనే మొదలైంది. అయితే ఆ తరువాత పోరాడి గెలిచారు. అలా జయాపజయాలతో అగ్రనటి స్థాయికి ఎదిగారు. 2004లోనే బాలీవుడ్‌లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చారు. అలా నటిగా దశాబ్దంన్నరకు చేరుకున్న కాజల్‌అగర్వాల్‌ అర్ధ శతకం చిత్రాలను దాటేవారు.

ఇటీవల కాజల్‌అగర్వాల్‌ వరుసగా అపజయాలను మూటకట్టుకుంటోంది. గాలి కూడా ఎదురీస్తోంది. ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుని నటించిన ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలమే అయ్యింది. హిందీలో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్‌ చిత్రానికి రీమేక్‌ ఇది. అంతే కాదు కాజల్‌ నటించిన తొలి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం కూడా ఇదే. సహ నటీమణులు చాలా మంది ఆశ పడ్డ ఈ చిత్రంలో నటించాలన్న అవకాశం తనను వరించడంతో కాజల్‌ అగర్వాల్‌ సంబరపడ్డారు.

అయితే అవి చిత్ర విడుదలలో జాప్యంతో నీరు కారిపోతున్నాయి. ఇకపోతే ఇటీవల మరో బిగ్‌ ఆఫర్‌ కాజల్‌ను వరించినట్టే వరించి ఇంకా అది ఊగిసలాడటం కూడా ఈ అమ్మడిని నిరాశ పరస్తున్న విషయం. అదే స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌–2లో నటించే అవకాశం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలు ఈ చిత్రానికి బ్రేక్‌ వేశాయి. కమలహాసన్‌ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల ఆ ఇండియన్‌–2 నిర్మాణం ముందుకు సాగలేదు.

ఇలా వరుసగా ఒక్కొక్కటి వెనక్కుపోవడంతో కాజల్‌ అగర్వాల్‌ సినీ జీవితం మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకటి, కోలీవుడ్‌లో ఒకటి అని కాజల్‌ చేతిలో రెండే రెండు చిత్రాలు ఉన్నాయి. వాటిలో జయంరవితో రొమాన్స్‌ చేస్తున్న కోమాలి చిత్రాన్నే కాజల్‌ అగర్వాల్‌ చాలా నమ్మకాలు పెట్టుకుందట. ఇక్కడ ఈ అమ్మడు సెంటిమెంట్‌పై ఆశలు పెట్టికుందని చెప్పవచ్చు.

జయంరవికి హీరోయిన్ల లక్కీ హీరో అనే పేరుంది. ఆయనతో కాజల్‌అగర్వాల్‌ జతకట్టిన తొలి చిత్రం కోమాలి. ఈ అమ్మడు నమ్మకం పెట్టుకోవడానికి ఇదో కారణం. అయితే కోమాలి చిత్రం కథ జయంరవి చుట్టూనే తిరుగుతుందట. అయినా చిత్ర హిట్‌ అయితే హీరోయిన్‌గా అది తన ఖాతాలోనూ పడుతుందిగా. తనకు కావలసింది హిట్‌ అంతే అనే ఆలోచనలో కాజల్‌ ఉందట.

ఇక మరో విషయం ఏమిటంటే అవకాశాలు సన్నిగిల్లడంతో ఈ బ్యూటీ గ్లామర్‌తో సొమ్ము చేసుకోవాలని భావించడమే కాకుండా అటుగా అడుగులు వేగంగా వేస్తోంది. తరచూ ఫొటో షూట్‌ చేయించుకుంటూ గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌స్ట్ర్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తోంది. అవి బాగానే ఈ అమ్మడిని ఎక్స్‌పోజ్‌ చేస్తున్నాయి. మరి ఏ మాత్రం అవకాశాలను తెచ్చి పెడతాయో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement