రాజుగారి గదిలో? | Kajal Aggarwal is the guest of the third royal in 'Rajagari Room-2' | Sakshi
Sakshi News home page

రాజుగారి గదిలో?

Published Sun, Jul 9 2017 12:31 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

రాజుగారి గదిలో? - Sakshi

రాజుగారి గదిలో?

కింగ్‌ నాగార్జున హీరోగా నటిస్తున్న ‘రాజుగారి గది–2’లో రాణీల్లాంటి అమ్మాయిలు ఇద్దరున్నారు. వాళ్లు ఎవరు? అంటే... సమంత, సీరత్‌ కపూర్‌. ఈ ఇద్దరిలో నాగార్జునకు జోడీగా కనిపించే రాణి ఎవరు? అనేది పక్కన పెడితే... ఇప్పుడీ సినిమాలో మూడో రాణి అడుగు పెట్టారనేది తాజా ఖబర్‌.

ఈ రాణీగారు అతిథిగా సందడి చేస్తారట. ఆ రాణి ఎవరో కాదు... కాజల్‌ అగర్వాలే. ‘‘ఆల్రెడీ 10 రోజులు కాజల్‌ ‘రాజుగారి గది–2’ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆమె నాగార్జునకు జోడీగా నటిస్తున్నారు. ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వార్తను దాచారు’’ అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్‌ థ్రిల్లర్‌ను పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరై్టన్మెంట్, ఓక్‌ ఎంటరై్టన్మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement