షాపింగ్‌ మాల్‌లో కిందపడిన నటి | Kajol Loses Balance & Falls Down In Public At A Mall | Sakshi
Sakshi News home page

షాపింగ్‌ మాల్‌లో కిందపడిన నటి

Jun 22 2018 2:50 PM | Updated on Jun 22 2018 5:06 PM

Kajol Loses Balance & Falls Down In Public At A Mall - Sakshi

సీరియస్‌గా షాపింగ్‌ మాల్లో ఎటో చూస్తూ నడుస్తూ ఉంటారు. సడెన్‌గా మీరు వేసుకున్న చెప్పులు పట్టుపట్టుజారి  కింద పడబోయారనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది. ఎవరైనా చూశారా? అనుకుంటూ... సిగ్గుతో తలదించుకుంటా. తాజాగా ఇదే పరిస్థితి బాలీవుడ్‌ నటి కాజోల్‌కు ఎదురైంది. ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌లో షాపింగ్‌కు వెళ్లిన నటి, సడన్‌గా తన హీల్స్‌ పట్టుపట్టుజారి  కింద పడిపోయారు. దీంతో వెంటనే ఆమె పక్కన ఉన్న ఓ బాడీగార్డు కాజోల్‌కు ఎలాంటి దెబ్బలు తగ్గలకుండా.. పట్టుకున్నాడు. ఈ ఘటన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది. దీన్ని చూసిన కాజోల్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు.  హెల్త్‌ గ్లో స్టోర్‌లోని ఈవెంట్లో పాల్గొనడానికి ఫోనిక్స్‌ మార్కెట్‌ సిటీ మాల్‌కు కాజోల్‌ వెళ్లారు. 

పొనిటైల్‌ వేసుకుని, మోకాలు వరకు ఉన్న తెల్లటి డ్రస్‌తో నటి ఆ మాల్‌లో మెరిసిపోయారు. కాజోల్‌ను చూసిన అభిమానులందరూ ఒక్కసారిగా ఆమె చుట్టూ గుమ్మిగూడారు. వారి నుంచి తప్పిస్తూ.. బాడీగార్డులు కాజోల్‌ను ఎలివేటర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కాజోల్‌ తాను వేసుకున్న హీల్స్‌ పట్టు తప్పడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే ఆమె పక్కన ఉన్న సెక్యురిటీ, కాజోల్‌ను పట్టుకుని ఆమెకు ఎలాంటి దెబ్బలు తగలనీయలేదు. బాడీగార్డుకు కాజోల్‌ కృతజ్ఞత చెప్పారు. కాజోల్‌ ఇలా పడటం ఇదే మొదటిసారి కాదు. దిల్‌వాలే ప్రమోషన్స్‌ సమయంలో కూడా కాజోల్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. స్టేజీపై ఆమె కింద పడబోతే, ఆమె సహ నటుడు వరుణ్‌ దావన్‌ పట్టుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement