త్వరలో తెరపైకి కళాభవన్ చివరి చిత్రం | Kalabhavan last film | Sakshi
Sakshi News home page

త్వరలో తెరపైకి కళాభవన్ చివరి చిత్రం

Published Fri, Jul 1 2016 1:36 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

త్వరలో తెరపైకి కళాభవన్ చివరి చిత్రం - Sakshi

త్వరలో తెరపైకి కళాభవన్ చివరి చిత్రం

సినిమానే కాదు ఈ లోకానే వదిలి వెళ్లిపోయిన విలక్షణ నటుడు కళాభవన్ మణి. ఆయనది హత్యో, ఆత్మహత్యో తెలియన సందిగ్ధ పరిస్థితి కొనసాగుతున్న తరుణంలో కళాభవన్  మణి నటించిన చివరి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇలాంటి పరిస్థితి బాధాకరం అంటున్నారు ఆ చిత్ర యూనిట్. సహారా ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై షాహీర్ జెన్ నిర్మించిన చిత్రం పుదుసానాన్ పొరందేన్.
 
 తెన్‌కాశి చిత్రంలో బాల నటుడిగా నటించిన బియోన్ ఆ తరువాత తమిళం, మలయాళం భాషల్లో 40 చిత్రాలకు పైగా నటించారు. ఆయన ఈ చిత్రం ద్వారా హీరోగా పరచయమవుతున్నారు. హీరోయిన్‌గా కల్యాణి నాయర్ నటించిన ఇందులో నటుడు కళాభవన్ మణి పోలీసు అధికారిగా ప్రధాన పాత్ర పోషించారు.
 
 ఇతర పాత్రల్లో కరాటే రాజా, విజయన్, నరేశ్, చార్మిళ నటించారు. బాలు కథ, కథనం,మాటలు అందించిన ఈ చిత్రానికి మజీద్ అబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ నటుడు కళాభవన్ మణి నటించిన చివరి చిత్రం పుదుసా నాన్ పొరందేన్ అని తెలిపారు. ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన ఆయనకు సంబంధించిన సన్నివేశాలను కోడైక్కానల్‌లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఒక రోజు ఆయన తీవ్ర జ్వరానికి గురయ్యారన్నారు.
 
 దీంతో తాము మరో రోజు షూటింగ్ చేద్దామని చెప్పినా, ఆయన అంగీకరించకుండా అంత జ్వరంలోనూ ఒక నీటి తొట్టెలో ఫైట్ సన్నివేశంలో నటించి సహకరించారన్నారు. అలాంటి మంచి నటుడు తమ చిత్ర విడుదల సమయంలో లేకపోవడం బాధగా ఉందన్నారు. పుదుసా నాన్ పొరందేన్ చిత్రాన్ని జూలై 8వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement