మంత్రగాడిగా వస్తున్న కమల్ | kamal Haasan to plays witch doctor in a tamil film | Sakshi
Sakshi News home page

మంత్రగాడిగా వస్తున్న కమల్

Published Sun, Mar 20 2016 11:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

మంత్రగాడిగా వస్తున్న కమల్

మంత్రగాడిగా వస్తున్న కమల్

వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కమల్ అతిథి పాత్రలకు కూడా సై అంటున్నాడు. సోలో హీరోగా హిట్ సినిమాలు చేస్తూనే కీలక పాత్రలో నటించడానికి అంగకీరించాడు. ప్రస్తుతం టికె రాజీవ్ దర్శకత్వంలో ఓ  సినిమా చేస్తున్న కమల్, ఆ సినిమాతో పాటు అముదేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో కమల్ ఓ డిఫరెంట్ లుక్లో కనిపించడానికి రెడీ అవుతున్నాడు.

మీన్కుంబం మన్పానయం పేరుతో తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ సినిమాలో ఓ మంత్రగాడి పాత్రలో కనిపించనున్నాడు కమల్. కాళిదాస్, అష్నా జవేరీ, ప్రభు, పూజా కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా దుశ్యంత్ రామ్ కుమార్, అభిరామిలు సంయుక్తంగా ఇషాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement