అప్పుడు... బలరామ్ నాయుడు! ఇప్పుడు... శభాష్ నాయుడు! | Kamal Hassan's next film to see his daughter in action | Sakshi
Sakshi News home page

అప్పుడు... బలరామ్ నాయుడు! ఇప్పుడు... శభాష్ నాయుడు!

Published Fri, Apr 29 2016 10:58 PM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

అప్పుడు... బలరామ్ నాయుడు! ఇప్పుడు... శభాష్ నాయుడు!

అప్పుడు... బలరామ్ నాయుడు! ఇప్పుడు... శభాష్ నాయుడు!

ఎనిమిదేళ్ల క్రితం పది పాత్రల్లో కమల్‌హాసన్ నటించిన ‘దశావతారం’ (2008) గుర్తుండే ఉంటుంది. అందులో కమల్ చేసిన పాత్రల్లో ‘రా’ ఆఫీసర్ బలరామ్ నాయుడు ఒకటి. కామెడీ టచ్ ఉన్న ఆ పాత్ర తెరపై కనిపించేది కాసేపే! ఆ పాత్ర ఎంత సూపర్‌హిట్ అంటే, ‘ఇంకాసేపు ఉంటే బాగుండు’ అని అప్పట్లో చాలామంది అనుకున్నారు. వాళ్ల కోరిక తీరనుంది. బలరామ్ నాయుడు పాత్రతో కమల్ ఓ కొత్త సినిమా మొదలుపెట్టారు. కమల్‌కు రియల్ డాటర్ శ్రుతీహాసన్ ఇందులో రీల్ డాటర్‌గా నటిస్తున్నారు.

ఈ తండ్రీకూతుళ్ళు కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. అలాగే, ఇందులో కమల్ భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ‘దశావతారం’లో బలరామ్ నాయుడితో పాటు పక్కనే ఉంటూ సందడి చేసిన క్యారెక్టర్ ఇంకోటి ఉంది కదా! అప్పట్లో ఆ పాత్రను డ్యాన్స్ మాస్టర్ రఘురామ్ చేశారు. ఇప్పుడు అప్పారావు పాత్రను తెలుగు, తమిళ వెర్షన్స్‌లో బ్రహ్మానందం చేస్తున్నారు.

హిందీలో ఈ పాత్రను రచయిత, నటుడు సౌరభ్ శుక్లా చేస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాలకు ‘శభాష్ నాయుడు’, హిందీ వెర్షన్‌కి ‘శభాష్ కుండూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. టి.కె. రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రాన్ని కమల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు స్వరపరుస్తుండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement