హీరోకు న్యూడ్ ఫొటోలు మెయిల్ చేసింది! | Kangana Ranaut and Hrithik Roshan affair only oneside love | Sakshi
Sakshi News home page

హీరోకు న్యూడ్ ఫొటోలు మెయిల్ చేసింది!

Published Sun, Apr 24 2016 5:54 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

హీరోకు న్యూడ్ ఫొటోలు మెయిల్ చేసింది! - Sakshi

హీరోకు న్యూడ్ ఫొటోలు మెయిల్ చేసింది!

ముంబై: మాజీ లవర్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లవ్ స్టోరీలో రోజుకో కొత్త మలుపు చోటుచేసుకుంటుంది. తాజాగా వీరి ప్రేమాయణంలో ఓ కొత్త విషయం తెలిసింది. తమ ప్రేమ వ్యవహారం రచ్చకెక్కడంతో పరస్పరం లీగల్ నోటీసులు ఇచ్చుకోవడం మనకు తెలిసిందే. 'క్వీన్' ఫేమ్ కంగనా రనౌత్ తనను మెంటల్ హెరాస్ చేసిందని హృతిక్ అంటున్నాడు. కంగనా తనకు చేసిన మెయిల్స్ ను ఒక్కొక్కటిగా పోలీసులకు హృతిక్ అందిస్తున్నాడు. ఈ వివరాలను బట్టి చూస్తే కంగనానే హీరోను ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది. కేవలం కంగనా మాత్రమే లవ్ చేసిందని, తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని హృతిక్ లీక్ చేసిన మెయిల్స్ లో ఆ వివరాలున్నాయి. ప్రతి ఆరు నిమిషాలకు ఒక మెయిల్ చేసిందని హృతిక్ బయటపెట్టిన మెయిల్స్ సారాంశం.

కేవలం వన్ సైడ్ లవ్ అని, అది కూడా కంగనా నుంచి మాత్రమే లవ్ ప్రపోజల్స్ వచ్చాయని ఈమెయిల్స్ చెబుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో వేలకొద్ది మెయిల్స్ చేసింది. 2014 అక్టోబర్ లో తనకు న్యూడ్ ఫొటో కూడా కంగనా పంపిందని, 'మన ఇద్దరం తొలిసారి కలిసినప్పుడు జరిగేది ఇదే' అంటూ తన పోస్ట్ లో ఆమె పేర్కొందని హృతిక్ లీక్ చేసిన మెయిల్స్ లో వెల్లడైంది. అదే ఏడాది సెప్టెంబర్ లో చేసిన మెయిల్స్ లో అయితే, ఉదయం లేవగానే హృతిక్ గురించి గూగుల్ ల్ సెర్చ్ చేయడంతోనే తన రోజు ప్రారంభమవుతుందని, అతని వాయిస్ వినాలని తానే హృతిక్ కు ఫోన్ చేస్తుంటానని అందులో ఉంది. తాను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని, తనను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావంటూ కంగనా ప్రశ్నించిన విషయం కూడా వాటిలో మనకు కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement