బిగ్‌బాస్‌ షోలో లైంగిక వేధింపులు | Kannada Bigg Boss Contestant Complaint in Women Commission | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ షోలో లైంగిక వేధింపులు

Published Tue, Feb 12 2019 12:31 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

Kannada Bigg Boss Contestant Complaint in Women Commission - Sakshi

కర్ణాటక, యశవంతపుర: బిగ్‌బాస్‌లో పోటీలలో పాల్గొన్న కవితాగౌడ.. యాండీ అనే పోటీదారుపై మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశా రు.  పోటీలో పాల్గొన్న యాండీ నడుచుకున్న విధానం తనకు నచ్చలేదన్నారు. షోలో జరిగిన అహితరక ఘటనకు సంబంధించి తను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించినట్లు ఆమె తెలిపారు. తనకు జరిగిన అన్యాయంకు సంబంధించి ప్రోగ్రాం ప్రోడ్యూసర్‌ గురుదాస్‌ శణైకి వివరించినట్లు ఆమె తెలిపారు. బిగ్‌బాస్‌ షో నుండి బయటకు వచ్చిన తరువాతనే ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల పాటు జరిగిన సూపర్‌ హీరో వర్సెస్‌ సూపర్‌ విలన్‌ టాస్క్‌లో యాండీ తనను లైంగికంగా హింసించిన్నట్లు ఆమె  ఆరోపించారు.  

నాకేం తెలియదు : యాండీ  
బిగ్‌బాస్‌ పోటీల నుండి బయట వెళ్లిన తరువాత కవితగౌడ తన కలవలేదని యాండీ తెలిపాడు.బిగ్‌బాస్‌ పోటీలలో కవితాగౌడ ఒటమిని తట్టుకోలేక తనపై లేనిపోని అరోపణలు చేస్తున్నట్లు చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement