క్రిష్ దర్శకత్వంలో కరీనా, శ్రద్ధాకపూర్
క్రిష్ దర్శకత్వంలో కరీనా, శ్రద్ధాకపూర్
Published Tue, Oct 8 2013 12:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ కథానాయకునిగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘గబ్బర్’ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. చిరంజీవి ‘ఠాగూర్’ చిత్రం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథ రీత్యా ఇద్దరు కథానాయికలు ఉంటారు. మరి అక్షయ్ సరసన జతకట్టే ఆ అందాల భామలెవరు? టాలీవుడ్‌లో కూడా చర్చనీయాంశమైన విషయం ఇది.
ఒక బాలీవుడ్ సినిమాలో నటించే కథానాయికల గురించి టాలీవుడ్‌లో కూడా చర్చలు జరగడం బహుశా ఈ సినిమా విషయంలో జరిగిందని చెప్పొచ్చు. అందుకు తగ్గట్టుగానే చాలామంది కథానాయికల పేర్లు మీడియాలో హల్‌చల్ చేశాయి. తమన్నా, శ్రుతిహాసన్, అమలాపాల్, ఇలియానా ఇలా చాలామంది దక్షిణాది కథానాయికల పేర్లు కూడా వినిపించాయి.
అయితే.. ఎట్టకేలకు ‘గబ్బర్’ కథానాయికలు ఖరారయ్యారు. కరీనాకపూర్, శ్రద్ధాకపూర్ ఈ పాత్రలకు ఎంపికైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అక్షయ్ భార్యగా కరీనా, ప్రియురాలిగా శ్రద్ధాకపూర్ నటించనున్నట్లు తెలిసింది. తమిళ చిత్రం ‘రమణ’ కథకు కొద్ది మార్పులతో చిరంజీవి ‘ఠాగూర్’ రూపొందింది. అయితే... ఆ కథను క్రిష్ తనదైన శైలిలో ఎన్నో మార్పులు చేసినట్లు సమాచారం.
సమకాలీన అంశాలను స్పృశించే విషయంలో క్రిష్‌ది ప్రత్యేక శైలి. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనం. లంచగొండితనం నిర్మూలనే ప్రధానాం శంగా రూపొందిన ఈ కథాంశాన్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా పలు మార్పులు చేసి క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిసింది. డిసెంబర్‌లో ‘గబ్బర్’ సెట్స్‌కి వెళ్లనుందని వినికిడి.
Advertisement
Advertisement