నేను ప్రెగ్నెంట్ కాదు బాబోయ్!! | Kareena kapoor denied the rumours of her being pregnant | Sakshi
Sakshi News home page

నేను ప్రెగ్నెంట్ కాదు బాబోయ్!!

Published Thu, Apr 7 2016 4:16 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నేను ప్రెగ్నెంట్ కాదు బాబోయ్!! - Sakshi

నేను ప్రెగ్నెంట్ కాదు బాబోయ్!!

ముంబయి: తాను ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తలపై బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నోరు విప్పింది. తనకు తల్లి కావాలన్న ఆశ ఉంది కానీ అయితే ఇప్పట్లో ఆ కల నెరవేర్చుకోవాలని లేదని బెబో అంటోంది. 2012 అక్టోబర్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ను ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మరుసటి ఏడాది నుంచి ఏదో ఓ సందర్భంలో కరీనా గర్భవతి అని పుకార్లు రావడం, ఈ టాప్ హీరోయిన్ ఆ వార్తల్ని కొట్టి పారేయడం జరుగుతూనే ఉంది. సెలబ్రిటీలే ఏం చేసినా వార్తే అవుతుందని తాజా సంఘటన నిరూపించింది.

ఇటీవల ఏదో అనుమానం వచ్చి గైనకాలజిస్టును కరీనా సంప్రదించారట. ఇక అంతే కరీనా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన ఈ అమ్మడు ప్రెగ్నెంట్ కాదని స్పష్టం చేసింది. దాంతో పాటు మరో రెండేళ్లపాటు తల్లిని కావడానికి ఇష్టపడటం లేదని చెప్పుకొచ్చింది. నలబై ఏళ్ల వయసులోనూ తల్లి కావచ్చునని గతంలో చెప్పిన మాటల్నే కరీనా నిజం చేస్తారేమోనని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కరీనా కపూర్ ఖాన్, అర్జున్ కపూర్ జంటగా నటించిన చిత్రం 'కి అండ్ కా' ఇటీవలే విడుదలై సక్సెస్ బాట పట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement