హౌజ్ ఆఫ్ కామన్స్ లో కరీనాకు సత్కారం!
ప్రపంచ వినోద పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా బాలీవుడ్ తార కరీనా కపూర్ ను ఏషియన్ ఎథ్నిక్ వీక్లీ హౌజ్ ఆఫ్ కామన్స్ ఘనంగా సత్కరించింది. బ్రిటన్ హోమ్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఎన్నారై ఎంపీ కీత్ వాజ్ ఈ కార్యక్రమానికి హాజరై.. కరీనా కపూర్ కు జ్ఞాపికను అందించారు.
ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ..యూకేతో చాలా కాలంగా తనకు అనుబంధం ఉంది అని అన్నారు. తన తాతమ్మ కూడా బ్రిటిష్ జాతీయురాలేనని..అంతేకాకుండా తన మామ, సైఫ్ ఆలీ ఖాన్ తండ్రి ఆక్స్ ఫర్డ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు అని కరీనా తెలిపింది.
'కభీ కుషీ కభీ ఘమ్', జబ్ వీ మెట్, ఓంకారా, 3 ఇడియెట్స్, గోల్ మాల్ 3, బాడీ గార్డ్ లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించారు.