Keith Vaz
-
‘మోసం చేశాడు.. అయినా క్షమిస్తున్నా’
లండన్: తనను కీత్ వాజ్ మోసం చేశాడని, అయినప్పటికీ ఆయనను మన్నిస్తున్నానని భార్య మారియా ఫెర్నాండెజ్ అన్నారు. మారడానికి కీత్ వాజ్ కు మరో అవకాశం ఇస్తున్నానని, అప్పటికీ మారకపోతే ఆయన నుంచి విడిపోతానని స్పష్టం చేశారు. బ్రిటన్ లో అత్యధికాలం ఎంపీగా ఉన్న భారత సంతతి నేతగా గుర్తింపు పొందిన కీత్ వాజ్.. పురుష సెక్స్ వర్కర్లతో రాసలీలలు సాగించిన వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనం రేపింది. నిషేధిత ఉత్ప్రేరకాలు కూడా ఆయన వాడినట్టు వెల్లడైంది. దీంతో హౌజ్ ఆఫ్ కామన్స్ హోమ్ అఫైర్స్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకోవలసి వచ్చింది. ‘ఈ వ్యవహారం నాకు దిగ్బ్రాంతి కలిగించింది. ఎందుకంటే ఇటువంటివి ఆయనకు అస్సలు ఇష్టముండేది కాదు. కీత్ వాజ్ చెడ్డ వ్యక్తి కాదు. మరోసారి ఇలాంటివి పునరావృతం కావని నాకు హామీయిచ్చారు. క్షమాపణ కూడా చెప్పార’ని బారిస్టర్ గా పనిచేసిన 57 ఏళ్ల మారియా అన్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై లీచెస్టర్ డిటెక్టివ్ లు దర్యాప్తు జరుపుతున్నట్టు ‘సండే టైమ్స్’ వెల్లడించింది. -
కాల్బాయ్స్తో ఎంపీ రాసలీలలు !
లండన్: భారత సంతతికి చెందిన ఓ బ్రిటన్ చట్టసభ సభ్యుడు చిక్కుల్లో పడ్డాడు. అతడిపై సెక్స్ స్కాండల్ ఆరోపణల నేపథ్యంలో తన బాధ్యతలకు తాత్కాలికంగా దూరం జరిగారు. గత చాలా కాలంగా బ్రిటన్‌లో చట్టసభలో ఎంపీగా కొనసాగుతున్న కెయిత్ వాజ్(59) అనే వ్యక్తి లైంగిక వాంచలు తీర్చే మేల్ సెక్స్ వర్కర్లకు డబ్బులు చెల్లించారని ఓ పత్రికలో కథనం వెలువడటంతో అందుకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి పక్కకు జరిగారు. అంతేకాదు, బ్రిటన్‌లో నిషేధించిన ఉత్ప్రేరకాలు కూడా ఆయన కొనుగోలుచేసినట్లు సదరు కథనంలో ఆ పత్రిక పేర్కొంది. బ్రిటన్‌లో లైసిస్టర్ ప్రాంతం నుంచి 1987 నుంచి ఎంపీగా కెయిత్ వాజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెలలో లండన్‌లోని తన ఫ్లాట్‌కు ఇద్దరు కాల్ బాయ్స్‌ను పిలిపించుకున్నాడని 'సండే మిర్రర్' ప్రచురించింది. దీంతో త్వరలోనే తాను హౌజ్ ఆఫ్ కామన్స్ హోమ్ అఫైర్స్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ఇందులో ఆయన పదేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. 'నా చర్యలతో తీవ్రంగా గాయపడిన, ఇబ్బందిపడిన నా భార్య, పిల్లలకు, మొత్తం కుటుంబానికి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో క్షమాపణలు చెబుతున్నాను. మంగళవారం విచారణ కమిటీ ముందు హాజరై పూర్తి వివరణ ఇస్తాను' అని కెయిత్ చెప్పాడు. మొత్తం రెండుసార్లు కెయిత్ ఈస్ట్రన్ యూరోపియన్‌కు చెందిన ఆ ఇద్దరితో 90 నిమిషాలపాటు సమావేశం అయ్యాడట. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకొచ్చిందట. ఆ రోజు ఆయన వారికి పంపించిన ఎస్సెమ్మెస్‌లో కొన్ని పరిశీలిస్తే.. 'రాత్రి 11 అయింది. నైస్.. కానీ బాగా ఆలస్యం. నాకు మంచి విడుపు కావాలి ప్లీజ్' అంటూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయన ఇంకా అధికారికంగా ఎంపీ బాధ్యతల నుంచి తప్పుకోలేదు. విచారణ జరుగుతోంది. -
కోహినూర్ వజ్రం తిరిగొస్తుందా?
లండన్: కోహినూర్.. గుంటూరులో పుట్టి అక్కడినుంచి చేతులు మారి ఆంగ్లేయుల వశమైన ఈ వజ్రానికి పరిచయం అక్కర్లేదు. వందల ఏళ్లుగా మనకు దూరమైన ఈ అతిపెద్ద వజ్రం.. ఇప్పుడు మళ్లీ మన దేశానికి చేరుతుందా? భారత ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ నెలలో బ్రిటన్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో దీన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాల్సిందేనన్న వాదనలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. మొన్నామధ్య కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆక్స్ఫర్డ్ వెళ్లినప్పుడు.. వలసపాలనలో భారతదేశం నుంచి దోచుకున్న సంపద మొత్తాన్ని తిరిగి కక్కాల్సిందేనని గట్టిగా చెప్పారు. ఇప్పుడు ఆయన బాటలోనే.. బ్రిటిష్ ఎంపీ కీత్ వాజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నూటికి నూరుపాళ్లూ కోహినూర్ వజ్రం భారత్‌కే చెందాలని, ప్రధాని నరేంద్రమోదీ చేతికి దానిని అందించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు మంగళవారం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌ను అభ్యర్థించారు. బ్రిటన్‌లో ఎంపీగా అత్యధిక కాలం కొనసాగుతున్న ఆసియావాసిగా రికార్డులకెక్కిన కీత్ వాజ్ వ్యాఖ్యలతో కోహినూర్ వజ్రాం మరోసారి చర్చనీయాంశమైంది. ఇదీ కోహినూర్ ప్రస్థానం.. గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాత వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తారు. తర్వాతికాలంలో కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. క్రీస్తు శకం 1310లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. ఢిల్లీ సుల్తాన్‌తో సంధి చేసుకున్న సమయంలో అపార సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా సమర్పించుకున్నాడు. 1526లో ఈ వజ్రం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ వశం అయి.. బాబర్ వజ్రంగా పేరు పొందింది. మొఘల్ సామ్రాజ్యం ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో నాదిర్ షా దీన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అది నెరవేరలేదు గానీ దానిని చూసే భాగ్యం మాత్రమే ఆయనకు దక్కింది. నిజానికి కోహినూర్ కు ఆ పేరు (కోహ్-ఇ-నూర్ అంటే కాంతి శిఖరం) పెట్టింది కూడా నాదిర్ షాయే. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ద్వారా 1913లో ఈ వజ్రం విక్టోరియా రాణికి బహుమతిగా వెళ్లింది. అప్పటి నుంచి లండన్‌లోనే ఉండిపోయిన కోహినూర్ ప్రస్తుతం లండన్‌లోని ఓ మ్యూజియంలో ఉంది. దాన్ని తిరిగివ్వాల్సిందిగా భారత ప్రభుత్వం ఇన్నాళ్లూ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలిచలేదు. ఇప్పటికైనా మన కోహినూర్ మన చెంతకు చేరాలని ఆశిద్దాం. -
అత్యంత ప్రభావవంతమైన ఏసియన్‌గా మలాలా
లండన్: బ్రిటన్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆసియా వ్యక్తిగా పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ నిలిచారు. గరావీ గుజరాత్2(జీజీ2) అనే వారపత్రిక రూపొందించిన ‘జీజీ2 పవర్ 101’ జాబితాలో ఆమె మొదటి స్థానంలో నిలిచారు. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన జీజీ2 నాయకత్వ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మలాలాతోపాటు బాలికా విద్య కోసం స్వాత్ లోయలో తాలిబన్ల తూటాలకు ఎదురొడ్డిన కైనాత్ రియాజ్, షాజియా రంజాన్లకు జీజీ2 హ్యామర్ అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మలాలా హాజరుకాకున్నా.. రికార్డు చేసిన తన సందేశాన్ని పంపించారు. జాబితాలో బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్ రెండు, స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ మూడు స్థానాల్లో నిలిచారు. -
హౌజ్ ఆఫ్ కామన్స్ లో కరీనాకు సత్కారం!
ప్రపంచ వినోద పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా బాలీవుడ్ తార కరీనా కపూర్ ను ఏషియన్ ఎథ్నిక్ వీక్లీ హౌజ్ ఆఫ్ కామన్స్ ఘనంగా సత్కరించింది. బ్రిటన్ హోమ్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఎన్నారై ఎంపీ కీత్ వాజ్ ఈ కార్యక్రమానికి హాజరై.. కరీనా కపూర్ కు జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ..యూకేతో చాలా కాలంగా తనకు అనుబంధం ఉంది అని అన్నారు. తన తాతమ్మ కూడా బ్రిటిష్ జాతీయురాలేనని..అంతేకాకుండా తన మామ, సైఫ్ ఆలీ ఖాన్ తండ్రి ఆక్స్ ఫర్డ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు అని కరీనా తెలిపింది. 'కభీ కుషీ కభీ ఘమ్', జబ్ వీ మెట్, ఓంకారా, 3 ఇడియెట్స్, గోల్ మాల్ 3, బాడీ గార్డ్ లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించారు.