‘మోసం చేశాడు.. అయినా క్షమిస్తున్నా’ | Feel Betrayed, But I'm Forgiving Him: Wife Of Keith Vaz | Sakshi
Sakshi News home page

‘మోసం చేశాడు.. అయినా క్షమిస్తున్నా’

Published Mon, Sep 12 2016 8:27 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

‘మోసం చేశాడు.. అయినా క్షమిస్తున్నా’ - Sakshi

‘మోసం చేశాడు.. అయినా క్షమిస్తున్నా’

లండన్: తనను కీత్ వాజ్ మోసం చేశాడని, అయినప్పటికీ ఆయనను మన్నిస్తున్నానని భార్య మారియా ఫెర్నాండెజ్ అన్నారు. మారడానికి కీత్ వాజ్ కు మరో అవకాశం ఇస్తున్నానని, అప్పటికీ మారకపోతే ఆయన నుంచి విడిపోతానని స్పష్టం చేశారు. బ్రిటన్ లో అత్యధికాలం ఎంపీగా ఉన్న భారత సంతతి నేతగా గుర్తింపు పొందిన కీత్ వాజ్.. పురుష సెక్స్ వర్కర్లతో రాసలీలలు సాగించిన వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనం రేపింది. నిషేధిత ఉత్ప్రేరకాలు కూడా ఆయన వాడినట్టు వెల్లడైంది. దీంతో హౌజ్ ఆఫ్ కామన్స్ హోమ్ అఫైర్స్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకోవలసి వచ్చింది.

‘ఈ వ్యవహారం నాకు దిగ్బ్రాంతి కలిగించింది. ఎందుకంటే ఇటువంటివి ఆయనకు అస్సలు ఇష్టముండేది కాదు. కీత్ వాజ్ చెడ్డ వ్యక్తి కాదు.  మరోసారి ఇలాంటివి పునరావృతం కావని నాకు హామీయిచ్చారు. క్షమాపణ కూడా చెప్పార’ని బారిస్టర్ గా పనిచేసిన 57 ఏళ్ల మారియా అన్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై లీచెస్టర్ డిటెక్టివ్ లు దర్యాప్తు జరుపుతున్నట్టు ‘సండే టైమ్స్’ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement